India Playing XI: అశ్విన్ ఔట్.. శార్దూల్ డౌట్! సౌతాఫ్రికాతో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

పార్ల్: మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాసే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్న టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్న భారత్.. వన్డే సిరీస్‌కు సమయాత్తం అయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పార్ల్ వేదికగా బుధవారం జరగనున్న తొలి వన్డేలో సౌతాఫ్రికాతో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమిండియా తలపడనుంది. 2016 అక్టోబర్ తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కాకుండా ఫస్ట్ టైమ్ ఓ ప్లేయర్‌గా బరిలోకి దిగబోతుండటంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. యువ ఆటగాళ్లతో కూడిన జట్టులో అవకాశం ఎవరిని వరిస్తుందో అనేది కూడా చర్చనీయాంశమైంది.

కోహ్లీ ప్లేయర్‌గా..

కోహ్లీ ప్లేయర్‌గా..

గత ఏడేళ్లుగా కెప్టెన్‌గా ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. టీమ్‌మేట్స్‌కు సూచనలు ఇస్తూ కనిపించిన విరాట్ కోహ్లీ.. ఇప్పటి నుంచి మరో కెప్టెన్ మాట వినాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ ప్లేయర్ రోల్‌కు తను ఎలా అడ్జస్ట్ అవుతాడన్నది ఆసక్తికరం. అలాగే కెప్టెన్సీ భారం లేకపోవడంతో బ్యాటర్‌గా మళ్లీ మునపటి ఫామ్‌లోకి రావాలని విరాట్ సైతం ఆశిస్తున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అతని బ్యాట్ పవర్ తగ్గినా.. వన్డేల్లో నిలకడగాననే ఆడుతున్నాడు. గత రెండేళ్లుగా 12 వన్డేల్లో 46.66 సగటుతో 560 రన్స్ చేశాడు. పైగా 2018 సౌతాఫ్రికా పర్యటనలో కోహ్లీ దుమ్మురేపాడు. మూడు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 286 రన్స్ చేశాడు. మళ్లీ అదే పెర్ఫామెన్స్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.

శిఖర్ ధావన్‌కు అగ్ని పరీక్ష..

శిఖర్ ధావన్‌కు అగ్ని పరీక్ష..

ఆఖరి క్షణంలో రోహిత్ శర్మ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన శిఖర్‌ ధావన్‌కు ఈ సిరీస్ అగ్ని పరీక్షలాంటిదే. ద్వితీయ శ్రేణి టీమ్ కెప్టెన్‌గా శ్రీలంక పర్యటనలో జట్టును నడిపించిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడుతాడని భావించినా సెలెక్టర్లు అతన్ని తీసుకోలేదు. 36 ఏళ్ల ధావన్.. టీమ్ లాంగ్ ఫార్మాట్స్ ప్రణాళికల్లో లేడు. ఈ సిరీస్‌లో విఫలమైతే అతని కెరీర్‌కు ముగింపు పడ్డట్లే. రోహిత్ గైర్హాజరీలోనే జట్టులోకి వచ్చిన ధావన్‌కు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌ల రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది. ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే అనుభవం దృష్ట్యా తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌తో అతనే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది.

ఫినిషర్‌గా వెంకటేశ్ అయ్యర్..

ఫినిషర్‌గా వెంకటేశ్ అయ్యర్..

మిడిలార్డర్‌లో కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గత రెండేళ్లుగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్ చేశాడు. 69.25 సగటుతో 554 రన్స్ చేశాడు. ఈ సూపర్ రికార్డు నేపథ్యంలో ఇషాన్ కిషన్, గైక్వాడ్‌ల్లో ఒకరిని ధావన్‌కు తోడుగా పంపించి కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడిస్తే మాత్రం శ్రేయస్ అయ్యర్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఇక హార్దిక్ పాండ్యా ప్రత్యామ్నాయంగా వెంకటేశ్ అయ్యర్‌ను సిద్దం చేయాలని భావిస్తున్న టీమ్‌మేనేజ్‌మెంట్ ఫస్ట్ వన్డేల్లో అతనికి చోటిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓపెనర్ అయిన అతను విజయ్ హజారే ట్రోఫీలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. వెంకటేశ్‌ను తీసుకుంటే శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

అశ్వినా? చాహలా?

అశ్వినా? చాహలా?

ఈ సిరీస్‌లో బౌలింగ్ కాంబినేషన్ ఎంచుకోవడం భారత్‌కు సవాల్‌గా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ ప్రధాన పేసర్లుగా బరిలోకి దిగం ఖాయంగా కనిపిస్తోంది. ఓ స్పిన్నర్‌ను ఆడించే అవకాశం ఉంది. సిరాజ్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండటంతో దీపక్ చాహర్‌కు లైన్ క్లియర్ అయింది. పైగా అతనికి బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండటం అదనపు బలం. అయితే భువీ, చాహర్ ఒకే తరహా బౌలర్లు అని భావిస్తే శార్దూల్‌కు చోటు దక్కవచ్చు. ఇక 2017 జూన్ తర్వాత అశ్విన్ వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే అతనికి యుజ్వేంద్ర చాహల్‌ నుంచి గట్టి పోటీ ఉంది. సౌతాఫ్రికా పిచ్‌లపై స్పిన్ ప్రభాతం తక్కువ కాబట్టి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన అశ్విన్‌కే చోటు దక్కవచ్చు. అయితే స్పిన్నర్ వద్దని భావిస్తే మాత్రం ఐదుగురు పేసర్లతో బరిలోకి కూడా దిగవచ్చు.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్/వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్/ అశ్విన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, January 18, 2022, 9:56 [IST]
Other articles published on Jan 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X