India Playing 11 vs Hongkong : కేఎల్ రాహుల్, అవేశ్ ఖాన్ ఔట్.. నేటి మ్యాచ్‌కు భారత తుది జట్టు ఇదే..!

ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక గ్రూప్ ఏలో ఈ విజయంతో టాప్ పొజిషన్‌కు చేరిన ఇండియా నేడు రెండో మ్యాచ్ హాంకాంగ్‌తో తలపడనుంది. క్వాలిఫయర్‌గా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన హాంకాంగ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటీవల ఆ జట్టు నిలకడ ప్రదర్శన కనబర్చుతుంది. గతంలో ఆసియా కప్‌లో 2008లో, 2018లో హాంకాంగ్‌తో ఇండియా తలపడింది. ఆ రెండు సార్లు ఇండియానే గెలిచింది. ఇకపోతే దుబాయ్ స్టేడియం వేదికగా ఇరు జట్లు నేడు రాత్రి 7.30కు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ తాము ఓడే ప్రసక్తే లేదంటూ కాన్ఫిడెంట్‌తో చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే తొలి మ్యాచ్‌లో గెలుపు అనంతరం టీమిండియా తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగే వీలుంది. హాంకాంగ్ లాంటి జట్టుపై ఈ మార్పులు చేపట్టడం ద్వారా రిజల్ట్ విషయంలో కాస్త ఇబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ ఈ నిర్ణయం తీసుకునే వీలుంటుంది. కేఎల్ రాహుల్, అవేశ్ ఖాన్‌లను ఈ మ్యాచ్‌లో పక్కన పెట్టొచ్చు.

ఓపెనర్లుగా వీరు
కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పాక్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అందువల్ల లెఫ్టార్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లకు ఇబ్బంది ఎదురవుతుంది. పాక్ మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టమైంది. దీంతో రవీంద్ర జడేజాను నంబర్ 4 బ్యాటర్‌గా పంపాల్సి వచ్చింది. ఇక లెఫ్టాండర్ ప్రాధాన్యాన్ని గమనించిన మేనేజ్ మెంట్ కేఎల్ రాహుల్ స్థానంలో.. రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. దీంతో రోహిత్, పంత్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం దాదాపు లాంఛనమే. కేఎల్ రాహుల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. తొలి మ్యాచ్‌లో రాహుల్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే.

మిడిలార్డర్‌లో వీరు
ఇక ఫస్ట్‌డౌన్ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ స్పాట్ దాదాపు ఫిక్స్. గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించేలా ఆడిన కోహ్లీ కీలక 35పరుగులు చేయడంతో అతని బెర్త్ ఖాయంగా ఉంది. ఇక నంబర్ 4బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. పాక్ మ్యాచ్‌లో జడేజా దిగినప్పటికీ.. పంత్ తుది జట్టులో ఉంటే జడేజా ఎప్పటిలాగే తన 6వ స్థానంలో బరిలోకి దిగుతాడు. ఇక 5వ స్థానంలో పాకిస్థాన్ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నాడు.

లోయర్ ఆర్డర్లో వీరు
ఇక ఫినిషర్ అని పేరు పడ్డ దినేష్ కార్తీక్.. పాకిస్థాన్ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్ దిగడం వల్ల అతనికి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడే అవకాశం రాలేదు. అయితే గత కొంత కాలంగా ఫినిషింగ్లో మెరుపులు మెరిపిస్తుండడం.. మంచి ఫాంలో ఉండడంతో డీకే తుది జట్టులో ఉండడం ఖాయంగా ఉంది. అయితే అతని కంటే ముందు రవీంద్ర జడేజా 6వ స్థానంలో బరిలోకి దిగనుండగా.. 7వ స్థానంలో డీకే బరిలోకి దిగనున్నాడు. దీంతో 7వ స్థానం వరకు ఇండియాకు నిఖార్సైన బ్యాటింగ్ లైనప్ ఉండడం కలిసొస్తుంది.

బౌలర్లుగా వీరు
ఇక పాక్ మ్యాచ్‌లో 4వికెట్లతో సత్తా చాటిన భువీ భారత బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతనికి తోడుగా కేవలం అర్షదీప్ సింగ్ మాత్రమే బరిలోకి దిగే వీలుంది. మూడో పేసర్ అయిన అవేశ్ ఖాన్‌ను బెంచ్‌కు పరిమితం చేసి అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇక యుజ్వేంద్ర చాహల్ ఎలాగూ భారత టాప్ ఛాయిస్ స్పిన్నర్ అనే సంగతి తెలిసిందే. తద్వారా హార్దిక్ పాండ్యాతో కలుపుకుని ఇండియాకు ముగ్గురు పేస్ ఆప్షన్లు, జడేజాతో కలుపుకుని ముగ్గురు స్పిన్ ఆప్షన్లు ఉంటాయి.

భారత తుది జట్టు అంచనా :
1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 3.విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా, 6.రవీంద్రా జడేజా, 7.దినేష్ కార్తీక్, 8.రవిచంద్రన్ అశ్విన్, 9.భువనేశ్వర్ కుమార్, 10.అర్షదీప్ సింగ్, 11.యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications