న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing 11 vs England: హార్దిక్, పంత్ డౌటే.. శార్దూల్‎కు చోటు పక్కా! ఇంగ్లండ్‌తో బరిలోకి దిగే భారత జట్టు

India Playing 11 vs Eng T20 World Cup Pratice Match: Shardul Thakur In And Hardik Pandya Out

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సందడి ముగిసింది. అయినా క్రికెట్ ప్రేమికులు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరో క్రీడా సంబురంకు రేపు (అక్టోబర్ 17) తెరలేవనుంది. యూఏఈ వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 పోటీలు మొదలుకానున్నాయి. అక్టోబర్ 17న డబుల్ హెడర్‌తో (క్వాలిఫైయర్ మ్యాచులు) మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. తొలి గేమ్‌లో ఒమన్‌ జట్టు పాపువా న్యూ గినియాతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది. సూపర్ 12 స్టేజ్ మాత్రం అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14న జరుగుతుంది.

Shardul Thakur: శార్దూల్ ఠాకూర్‌కు అదిరే బర్త్‎డే గిఫ్ట్.. జీవితంలో మర్చిపోడుగా! ధోనీ దగ్గరుండి మరీ!!Shardul Thakur: శార్దూల్ ఠాకూర్‌కు అదిరే బర్త్‎డే గిఫ్ట్.. జీవితంలో మర్చిపోడుగా! ధోనీ దగ్గరుండి మరీ!!

ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌:

ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌:

టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. 18న ఇంగ్లండ్‌తో (7:30 pm), 20న ఆస్ట్రేలియాతో (3:30 pm) భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో 18న ఇంగ్లండ్‌తో ఆడే భారత తుది ఓసారి పరిశీలిద్దాం.

ఇషాన్ కిషన్‌కు అవకాశం:

ఇషాన్ కిషన్‌కు అవకాశం:

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా.. రాహుల్ దుమ్ములేపాడు. పరుగుల వరద పారిస్తూ కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అయితే పంత్ ఐపీఎల్ 2021లో విఫలమయిన నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇషాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2021లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు. ఒకవేళ రిషబ్ ఉంటే పాండ్యా బదులుగా కూడా కిషన్‌ ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

అశ్విన్, చహర్‌కు నిరాశే:

అశ్విన్, చహర్‌కు నిరాశే:

ఆల్‌రౌండర్‌ కోటాలో శార్దూల్‎ ఠాకూర్, రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్ 2021లో ఇరగదీసారు. ముఖ్యంగా శార్దూల్‎ చెన్నై తరఫున 21 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కీలక సమయంలో మ్యాచును మలుపుతిప్పాడు. బీసీసీఐ ముందుగా ప్రకటించిన భారత జట్టులో శార్దూల్ లేదన్న విషయం తెలిసిందే. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. దాంతో ఆర్ అశ్విన్, రాహుల్ చహర్‌కు నిరాశే ఎదురుకానుంది. పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు చోటు దక్కనుంది.

భారత తుది జట్టు (అంచనా):

భారత తుది జట్టు (అంచనా):

రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌/హార్దిక్ పాండ్యా, శార్దూల్‎ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.

Story first published: Saturday, October 16, 2021, 18:53 [IST]
Other articles published on Oct 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X