
బిగ్ మ్యాచ్..
ఇవ్వాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్ జట్టు స్కాట్లాండ్‌తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ ఈ ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. రెండో మ్యాచ్ ఐర్లాండ్-జింబాబ్వేల మధ్య ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఇది షెడ్యూల్ అయింది. ఇవ్వాళ జరిగే ఈ రెండు మ్యాచ్‌లు కూడా అభిమానులను కట్టి పడేసేవే. రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ను లిఫ్ట్ చేసిన ఘనత ఉన్న జట్టు విండీస్. ప్రస్తుతం గ్రూప్ దశ మ్యాచ్‌లను ఆడాల్సి వస్తోంది. ఐర్లాండ్-జింబాబ్వేలో కూడా భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.

అఫీషియల్‌గా..
అదే సమయంలో- భారత్ కూడా ఇవ్వాళ అఫీషియల్ వామప్ మ్యాచ్‌ను ఆడబోతోంది. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న ఆస్ట్రేలియాను ఎదుర్కొనబోతోంది. ఇది వామప్ మ్యాచే అయినప్పటికీ- అధికారికం. ఈ టోర్నమెంట్‌లో భారత్ ప్రస్థానం ఎలా ఉండబోతోందనే విషయాన్ని తేల్చేయనుంది. రెండు వామప్స్‌ను ఆడాల్సి ఉంది రోహిత్ సేనకు. ఎల్లుండి న్యూజిలాండ్‌ను మరో మ్యాచ్ ఉంటుంది.

లోకల్ టీమ్స్‌తో..
ఇదివరకు రెండు వామప్స్ ఆడినప్పటికీ.. అవి లోకల్ టీమ్స్‌తో. అందులో ఒకదాంట్లో భారత్ ఓడిపోయింది కూడా. ఇప్పుడిక అఫీషియల్ మ్యాచ్‌లల్లో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అరగంట ముందు టాస్ పడుతుంది. అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్.. రెండూ కూడా తమ పూర్తిస్థాయి జట్లతో ఆడాల్సి ఉంటుంది. అంతకుముందు వామప్‌లో ఇంగ్లాండ్ చేతిలో పరాభవాన్ని చవి చూసింది ఆసీస్.
లైవ్ ఇలా..
సూపర్ 12లోని అన్ని జట్లు కూడా వామప్‌లల్లో తలపడనున్నాయి. న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్-పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్-బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన-పాకిస్తాన్, బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మధ్య వామప్స్ ఉంటాయి. రెండో వామప్.. ఈ నెల 19వ తేదీన ఉంటుంది. ఇదే గబ్బా స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతుంది. ఇదే చివరిది కూడా. సూపర్ 12 దశ 22వ తేదీన ఆరంభమౌతంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఆడనున్నాయి. ఈ వామప్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో దీన్ని చూడొచ్చు.

తుదిజట్లు ఇలా..
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా తుదిజట్టులో- డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కేప్టెన్), స్టీవెన్ స్మిత్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












