India Playing 11 : వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత జట్టులో శ్రేయస్ అయ్యార్ ఔట్, పంత్ డౌట్..! టీం ఇదే

నేడు సెయింట్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20మ్యాచ్‌లో భారత తుది జట్టులోకి దీపక్ హుడా వచ్చే అవకాశం ఉంది. దీపక్ హుడా ఇటీవల ఐర్లాండ్‌పై తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అతను టీ20ల్లో మంచి ఫాంలో ఉన్నప్పటికీ.. బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇకపోతే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్లో అతనికి మూడు మ్యాచ్‌లలో అవకాశం దక్కింది. టీ20 సిరీస్లో తొలి మ్యాచ్‌లో మళ్లీ అతనికి మొండిచేయే ఎదురైంది. ఇక రెండో మ్యాచ్‌కు మాత్రం అతను ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మిడిలార్డర్లో అతన్ని తీసేయడం అంతా ఈజీ కాదు
ఇక తొలి టీ20లో శ్రేయస్ అయ్యార్ (0) డకౌట్ అయ్యాడు. అలాగే వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ కేవలం 12 బంతుల్లో 14 పరుగులు చేసి.. పేలవ షాట్ ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యార్ ప్లేస్‌లో దీపక్ హుడాకు ఛాన్స్ గ్యారెంటీగా కన్పిస్తుండగా.. పంత్ స్థానంలో సంజూ బరిలోకి దిగడానికి కొన్ని అవకాశాలున్నాయి. అయితే పంత్‌ను తీసేయడం అంత ఈజీ ఏం కాదు. టీం మేనేజ్ మెంట్ పంత్ లాంటి మిడిలార్డర్ లెఫ్టాండర్‌కే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో పంత్ మినహా స్పెషలిస్టు లెఫ్టాండర్ లేరు.

ఓపెనర్లుగా వీరే
తొలి టీ20ల్లో అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా రోహిత్‌తో కలిసి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం కొంత మేర సక్సెస్ అయినట్లే కన్పించింది. వీరిద్దరు క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు దూసుకెళ్లింది. సూర్యకుమార్ యాదవ్ (24పరుగులు), రోహిత్ శర్మ (64పరుగులు) రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా ఈ జోడీ బరిలోకి దిగడం ఖాయమే.

మిగతా బ్యాటర్లు వీరే
భారత జట్టులో మిడిలార్డర్లో రాణించగల ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ టీ20 ఫార్మాట్లో సరిగ్గా రాణించకపోయినా పంత్, శ్రేయస్ అయ్యార్‌లను టీం మేనేజ్ మెంట్ కొనసాగిస్తూనే ఉంది. అయితే రెండో టీ20కి మాత్రం మార్పులు జరిగే వీలుంది. వారి స్థానాల్లో దీపక్ హుడా, సంజూ శాంసన్‌లను తుది జట్టులోకి తీసుకునే వీలుంది. పంత్ కొనసాగే వీలున్నా.. శ్రేయస్ స్థానంలో మాత్రం దీపక్ హుడా దాదాపు ఆడడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక ప్రస్తుత ఫాం ప్రకారం ఫినిషర్ దినేష్ కార్తీక్ ఎలాగూ ఆడాల్సిందే.

ఆల్రౌండర్లు, బౌలర్లు వీరే
ఇండియాకు నిఖార్సైన ఆల్రౌండర్లు ఉండడం కలిసొస్తుంది. రవీంద్రా జడేజా, హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లోనూ ఆడడం పక్కా. తొలి టీ20లో భారత బౌలింగ్ యూనిట్ బాగా రాణించింది. వెస్టిండీస్ బ్యాటర్లను బౌలర్లు ఈజీగా కట్టడి చేయగలిగారు. అందువల్ల సేమ్ బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్ లోనూ కొనసాగే వీలుంది. రవి అశ్విన్, రవి బిష్ణోయ్ స్పిన్ లీడ్ చేయనుండగా.. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నారు.

తుది జట్టు
1. రోహిత్ శర్మ (కెప్టెన్), 2.సూర్యకుమార్ యాదవ్, 3.దీపక్ హుడా, 4. రిషబ్ పంత్ / సంజూ శాంసన్, 5.హార్దిక్ పాండ్యా, 6.దినేష్ కార్తీక్, 7.రవీంద్రాజడేజా, 8.రవిచంద్రన్ అశ్విన్ 9. భువనేశ్వర్ కుమార్, 10. అర్షదీప్ సింగ్, 11. రవి బిష్ణోయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications