Ind vs Eng 1st T20I: అందుకే బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. అర్షదీప్ సింగ్ అరంగేట్రం, ఇండియా ప్లేయింగ్ 11 ఇదే..!

సౌతాంప్టన్ : ఇంగ్లాండ్‌పై రీషెడ్యూల్డ్ టెస్ట్ గెలిచే అవకాశం కోల్పోయిన ఇండియా ఇక షార్ట్ ఫార్మాట్లో సత్తా చాటాలని సిద్ధమైంది. ఇప్పుడు టీ20 సిరీస్‌కు సన్నద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20లో ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఇక ఈ మ్యాచ్ రాత్రి 10.30కు ప్రారంభం కానుంది. టెస్ట్‌కు, టీ20కి మధ్య గ్యాప్ ఒక్కరోజే ఉండడంతో తొలి టీ20ని ఇలా లేటుగా షెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన ప్లేయర్లు తొలి టీ20కి దూరంగా ఉండగా.. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ గెలిచిన జట్టుతో కెప్టెన్ రోహిత్ బరిలోకి దిగబోతున్నాడు.
ఇక ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా ఈ టీ20 మ్యాచ్‌కు వ్యవహరించబోతుండడం విశేషం. ఇక రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. కాకపోతే జాసన్ రాయ్, జాస్ బట్లర్, లియామ్ లివింగ్ స్టోన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఇంగ్లాండ్ జట్టులో ఉండడంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

అదిరిపోయే అరంగేట్రం
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయబోతున్నాడు. గతంలో ఐర్లాండ్, దక్షిణాఫ్రికా సిరీస్లకు ఎంపికైన అర్షదీప్‌కు ఇంకా తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో.. ఇంగ్లాండ్ లాంటి ప్రత్యర్థి మీద అర్షదీప్ సింగ్ అరంగేట్రం చేయబోతుండడం విశేషం. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అత్యధ్భుతంగా రాణించిన అర్షదీప్ సింగ్‌కు జాతీయ జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే.

ఇతర కుర్రాళ్లకు కూడా అవకాశాలొస్తాయి.
ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం స్టేడియంలోకి వచ్చారు. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 'మేము తొలుత బ్యాటింగ్ చేయబోతున్నాం. ప్రస్తుతం వికెట్ మంచిగా కనిపిస్తోంది. మంచి పిచ్, మంచి ఎండ ఉన్నందున తొలుత బ్యాటింగ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఈ మ్యాచ్‌కు ముందు కొన్ని ఇబ్బందులొచ్చిన మాట వాస్తవమే. మేం ప్రతీది అవగాహన చేసుకోవాలి. ఇక మేము ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నాం. ఇతర కుర్రాళ్లకు కూడా త్వరలోనే అవకాశాలు దక్కుతాయి. ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించడం మనం చూశాం.' అని రోహిత్ అన్నాడు.

ఇది నాకు గర్వించదగ్గ రోజు
ఇటీవలే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న జోస్ బట్లర్ టాస్ ఓడిన అనంతరం మాట్లాడుతూ.. దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించడం నిజంగా గొప్ప విషయం. ఈ రోజు నాకు చాలా గర్వకారణమైన రోజు. ఇయాన్ మోర్గాన్ జట్టును గొప్ప స్థానంలో ఉంచాడు. ప్రస్తుతం మా టెస్ట్ జట్టు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మేము టెస్ట్ జట్టు లాగే మా ఊపును కొనసాగిస్తామని ఆశిస్తున్నాం. గ్లీసన్, విల్లీ, సాల్ట్‌లు ఆడట్లేదు. మా సైడ్ ఇద్దరు ఆల్-రౌండర్లు ఉన్నారు.

తుది జట్లు
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications