
మరో బిగ్ మ్యాచ్..
అక్కడితో ఆగలేదు.. మూడో రోజు ఏకంగా హ్యాట్రిక్ నమోదైంది. టీ20 ఫార్మట్‌లో అరుదుగా చెప్పుకొనే హ్యాట్రిక్ మేజిక్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కుర్ర బౌలర్ సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 21 సంవత్సరాల వయస్సున్న యుఏఈ బౌలర్ కార్తీక్ మెయ్యప్పన్ - శ్రీలంకపై హ్యాట్రిక్ అందుకున్నాడు. ఇవ్వాళ గ్రూప్ దశలో ఐర్లాండ్-స్కాట్లాండ్, వెస్టిండీస్-జింబాబ్వే తలపడనున్నాయి.

వామప్ మ్యాచ్..
అదే సమయంలో- భారత్ కూడా ఇవ్వాళ రెండో వామప్ మ్యాచ్‌ను ఆడబోతోంది. న్యూజిలాండ్‌తో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఈ మధ్యాహ్నం ఉదయం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అరగంట ముందు టాస్ పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్, బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా కూడా ఇవ్వాళే వామప్స్ ఆడనున్నాయి. ఇవ్వాళ్టితో వామప్స్ మ్యాచ్‌లన్నీ ముగుస్తాయి. శనివారం నుంచి అసలు పోరు మొదలవుతుంది.

కాక మీదున్న టీమిండియా..
ఆస్ట్రేలియాపై ఫైనల్ ఓవర్ విక్టరీతో టీమిండియా కాక మీద ఉంది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ మొత్తం సమష్టిగా రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు అందుకున్నారు.. మెరుపువేగంతో. ఫలితంగా జట్టు 186 పరుగుల భారీ స్కోరును చేయగలిగింది. బ్యాటింగ్ విభాగంతో పోల్చుకుంటే- బౌలింగ్ కొంత బలహీనపడినట్టే కనిపించింది. ఆస్ట్రేలియా 180 పరుగుల వరకూ చేయగలగడమే దీనికి నిదర్శనం. చివరి ఓవర్‌లో మహ్మద్ షమీ మేజిక్ చేయకపోతే ఫలితం మరోలా ఉండేది.

ఓటమితో న్యూజిలాండ్..
న్యూజిలాండ్ పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. తొలి వామప్‌లో ఘోరంగా ఓడిందా జట్టు. 100 పరుగులు కూడా చేయలేకపోయింది. మార్టిన్ గప్టిల్-26, గ్లెన్ ఫిలిప్స్-20 మాత్రమే కొద్దో గొప్పో పరుగులు చేశారు. మిగిలిన వారెవరూ దక్షిణాఫ్రికా బౌలర్లను తట్టుకుని క్రీజ్‌లో నిలవలేకపోయారు. దీనితో ఇవ్వాళ్టి తుదిజట్టులో పలు మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డెవాన్ కాన్వే, జిమ్మీ నీషమ్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

తుదిజట్లు ఇలా..
టీమిండియా తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా తుదిజట్టులో- ఫిన్ అల్లెన్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ (కేప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ ఛాప్‌మన్, మిఛెల్ బ్రేస్‌వెల్, మిఛెల్ శాంట్నర్, ఆడమ్ మిల్నె, ఈష్ సోధి, లోకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












