డిసెంబర్ 30-ఫిబ్రవరి 24: దక్షిణాఫ్రికాలో కోహ్లీసేన పర్యటన షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను దక్షిణాఫ్రికా బోర్డు బుధవారం వెల్లడించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ సేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.
దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనలో డిసెంబరు 30న దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగే వార్మప్ మ్యాచ్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత జనవరి 5న ఇరు జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. డిసెంబరు 30న ప్రారంభమయ్యే ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 24తో ముగుస్తుంది.

డిసెంబర్ 30న వార్మప్ మ్యాచ్‌తో మొదలు
ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టులకు కేప్ టౌన్, సెంచూరియన్, జోహన్స్ బర్గ్ వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. మరోవైపు భారత మహిళల జట్టు ఫిబ్రవరి 5 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలోనే పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా మిథాలీ సేన దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

దక్షిణాఫ్రికాలో భారత పర్యటన:
డిసెంబర్
30-31, Warm-up match, Paarl
జనవరి (3 టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్)
5-9, First Test, Cape Town
13-17, Second Test, Centurion
24-28 Third Test, Johannesburg

ఫిబ్రవరి (ఆరు వన్డేల షెడ్యూల్)
1, First one-day international, Durban (day-night)
4, Second one-day international, Centurion (day)
7, Third one-day international, Cape Town (day-night)
10, Fourth one-day international, Johannesburg (day-night)
13, Fifth one-day international, Port Elizabeth (day-night)
16, Sixth one-day international, Centurion (day-night)

ఫిబ్రవరి (మూడు టీ20ల షెడ్యూల్)
18, First Twenty20 international, Johannesburg (day)
21, Second Twenty20 international, Centurion (day-night)
24, Third Twenty20 international, Cape Town (day-night)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications