4లక్షల మంది: భారత్-పాక్ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ మరే ఇతర మ్యాచ్‌కి లేదు


హైదరాబాద్: భారత్-పాక్ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడిలో నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐసీసీ ఈవెంట్లలో కూడా పాక్‌తో భారత్ తలపడకూడదన్న వాదన తెరపైకి వచ్చింది.

పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని
వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌పై రోజు రోజుకూ చర్చ పెద్దది అవుతుండటంతో ప్రభుత్వం, బీసీసీఐ పెద్దలు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. దీంతో జూన్ 16న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

భారత్-పాక్ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్
అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ ప్రపంచంలో మరే ఇతర జట్లకు లేదని వరల్డ్ కప్ టోర్నీ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తీ వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారం జూన్16న జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్ కోసం ఏకంగా నాలుగు లక్షల మంది టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారట.

అందుబాటులో 25వేల టిక్కెట్లే
భారత్-పాక్ మ్యాచ్‌కు కేవలం 25వేల టిక్కెట్లే అందుబాటులో ఉండగా వాటికోసం నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. వరల్డ్‌కప్‌లో మరే మ్యాచ్‌కూ ఇంత డిమాండ్ లేదని టోర్నీ నిర్వాహాకులు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వచ్చిన 2.40 లక్షల దరఖాస్తులు చాలా తక్కువని ఎల్‌వర్తీ పేర్కొన్నారు.

టిక్కెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ
టిక్కెట్ల కోసం దరఖాస్తుల వెల్లువను గమనిస్తే భారత్-పాక్ మ్యాచ్ టోర్నీకి ఎంత ప్రధానమైనదో అర్థమవుతుందని ఆయన అన్నారు. దీంతో భారత్, పాక్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉన్న కారణంగా చాలా మంది అభిమానులు నిరాశ చెందే అవకాశముందని ఎల్‌వర్తీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications