అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్ - భారత జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఇండియన్ టీవీలో చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌ను 288 మిలియన్‌ల అభిమానులు టీవీలలో చూశారు. ఈ మ్యాచ్‌లో ధోనీ సేన విజయం సాధించింది.
గత ప్రపంచ కప్(2011) అనంతరం మోస్ట్ వాచ్‌డ్ టెలివిజన్ ఈవెంట్ ఈ మ్యాచ్ కావడం గమనార్హం. దాయాదుల మధ్య జరిగిన ఈ మ్యాచ్ సమయంలో రేటింగ్ 14.8 వచ్చింది. ఇది దూరదర్శన్, స్టార్ నెట్ వర్క్‌లో ప్రసారం అయింది. ఈ మ్యాచ్ సమయంలో స్టార్ నెట్ వర్క్ రేటింగ్ 11.9గా, దూరదర్శన్ రేటింగ్ 2.9గా ఉంది.

స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ఐసీసీ ప్రపంచకప్ కంటే పెద్దది ఏదీ ఉండదని, భారత అభిమానులు టీమీండియా పైన విశ్వాసంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టర్‌గా తాము వివిధ భాషల్లో అందించే ప్రయత్నం చేస్తున్నామని, విస్తృత కవరేజ్ ఇస్తున్నామని చెప్పారు. మౌకా ప్రచారానికి ఆన్ లైన్లో 17 మిలియన్ వ్యూస్ వచ్చాయి.