Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుల్వామా ఉగ్రదాడి ఎపెక్ట్: భారత్-పాక్ మధ్య వరల్డ్ కప్ మ్యాచే చివరిది

India-Pakistan World Cup Game Last Thing On VVS Laxmans Mind Post Pulwama Attack

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సపోర్ట్‌గా నిలవాలని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. దుబాయిలో గురువారం జరిగిన డబ్ల్యూఐఓఎన్‌ గ్లోబల్‌ సమావేశానికి హాజరైన లక్ష్మణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు.

పుల్వామా ఉగ్రదాడిలో నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐసీసీ ఈవెంట్లలో కూడా పాక్‌తో భారత్‌ తలపడకూడదన్న వాదన తెరపైకి వచ్చింది. వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

భారత్-పాక్ మ్యాచ్‌పై మీడియా లక్ష్మణ్‌ని ప్రశ్నించగా "అందరిలో క్రికెటే చివరి ఆలోచనగా ఉంది. ప్రస్తుతం నా ఆలోచనలో కూడా చివరిగా భారత్‌-పాక్‌ మ్యాచే ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మనమంతా సైనిక కుటుంబాలకు అండగా ఉండాలి" అని అన్నారు.

షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ జట్ల మధ్య జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాపోర్డ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్‌తో భారత్ జట్టు ఆడాలా వద్దా అనే దానిపై ఫిబ్రవరి 27న దుబాయి వేదికగా ఐసీసీ నిర్వహించే సమావేశంలో స్పష్టత రానుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌, టీమిండియా తన ఫేవరెట్‌ జట్లుగా లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.

"గతేడాది కాలంగా టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆస్ట్రేలియాని వారి సొంత గడ్డపై ఓడించడం భారత్‌కు గట్టి సవాలే. ప్రస్తుతం జట్టంతా కలిసికట్టుగా ఆడుతోంది. బౌలింగ్‌ ఎటాక్‌ కూడా మెరుగ్గా ఉంది. సరైన సమయంలో టీమిండియా విజయాల బాట పడుతోంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ సిరీస్‌లలో గెలుపొందడం చూస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ గెలుస్తుంది" అని లక్ష్మణ్ అన్నారు.

Story first published: Thursday, February 21, 2019, 19:15 [IST]
Other articles published on Feb 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+