Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్‌పై ఫిబ్రవరి 27న ఐసీసీ కీలక నిర్ణయం!

ICC World Cup 2019 : Will India, Pak Clash At World Cup? ICC May Decide In Dubai | Oneindia Telugu
India-Pakistan World Cup Clash to be Discussed At Next ICC Meeting

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, అసలు ఈ మ్యాచ్‌ని నిర్వహించాలా? వద్దా? అనే దానిపై దుబాయి వేదికగా ఫిబ్రవరి 27న జరిగే సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్చించనుంది. వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటంతో దీనిపై ఐసీసీ దృష్టి సారించింది. మరోవైపు బీసీసీఐ సైతం పాక్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి సూచన ప్రాయంగా వచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా మాట్లాడుతూ

బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా మాట్లాడుతూ "పదేళ్లుగా భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే పాక్‌తో భారత్‌ తలపడుతోంది. వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వ నిర్ణయాన్నే బీసీసీఐ అనుసరిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను బీసీసీఐ సీఈఓ అమలు చేస్తారు" అని అన్నారు.

పాక్‌తో ఆడొద్దని ప్రభుత్వం చెబితే!

పాక్‌తో ఆడొద్దని ప్రభుత్వం చెబితే!

"పాక్‌తో ఆడొద్దని ప్రభుత్వం చెబితే ఆ ఆదేశాలను బీసీసీఐ పాటిస్తుంది. ఇకపై పాక్‌తో మ్యాచ్‌లు ప్రభుత్వ సూచనల మేరకే ఉంటాయి. ఏ నిర్ణయమైనా సరే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో సభ్యుల అభిప్రాయాల మేరకే క్రికెట్‌ పాలకుల కమిటీ తీసుకుంటుంది" అని బీసీసీఐ కార్యదర్శి నిరంజన్‌ షా అన్నారు.

పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశం

పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశం

మరోవైపు వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడేందుకు అంగీకరించకపోయినా... మ్యాచ్‌లో పాల్గొనక పోయినా పాక్‌కు పాయింట్లు దక్కే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ సైతం ఇప్పటి వరకు ఐసీసీతో సంప్రదింపులు జరపలేదు. ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, వరల్డ్‌కప్‌కు కొద్ది రోజుల ముందు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

2012-13 నుంచి పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు

2012-13 నుంచి పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు

ఇక, భారత్‌-పాక్‌ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అయితే లీగ్‌ మ్యాచ్‌లో ఆడకుండా ఉన్నా.. సెమీస్‌ లేక ఫైనల్‌లో ఆడాల్సి వస్తే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైనల్లో భారత్-పాక్ తలపడాల్సి వస్తే... పాక్ మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ గెలుస్తుందని అంటున్నారు.

Story first published: Wednesday, February 20, 2019, 19:09 [IST]
Other articles published on Feb 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+