Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ మ్యాచ్‌పై ధోని ప్రెస్ మీట్‌: హై ఓల్టేజ్ గేమ్... 5-0విజయాలపై ధోని

అడిలైడ్: వరల్డ్ కప్‌లో హై ఓల్టేజ్ గేమ్‌గా అభివర్ణిస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌పై టీమిండియా ధోని తన మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. వరల్డ్ కప్ చరిత్రలో ఐదు సార్లు భారత్ - పాకిస్ధాన్ తలపడితే ఐదు సార్లు భారతే గెలిచింది. అడిలైడ్‌ క్రికెట్ మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మొదలవున్న మ్యాచ్‌లో చరిత్రను ధోని సేన కొనసాగింపుగా విజయం సాధిస్తుందా లేదా పాకిస్ధాన్ టీమిండియాపై విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్ ధోని మాత్రం చరిత్రతో సంబంధం లేకుండా మేము రచించిన ప్రణాళికలను పాకిస్ధాన్ జట్టుపై అమలు చేస్తామని పేర్కొన్నారు. పాకిస్ధాన్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ధోని ప్రెస్ కాన్ఫరెన్స్ వివరాలిలా ఉన్నాయి.

 India-Pakistan WC clash: MS Dhoni speaks on high voltage game, nerves and 5-0 lead

* వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్‌పై 6-0ని కొనసాగిస్తారా?

ధోని: మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. మైదానంలో పాకిస్ధాన్‌పై ఆడేటప్పుడు ఎప్పుడూ కాస్తంత ఒత్తిడి ఉంటుంది. చుట్టు అభిమానుల కోలాహాలంతో ప్రతి ఒక్కరూ కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు మంచి అవకాశంం.

* పోటీ ఎలా ఉండబోతుంది?

ధోని: ముందుగానే అంచనా వేయడం కష్టం. జట్టులో ఎవరికీ ఎలాంటి గాయలు లేవు. ఒక్క ఇషాంత్‌ని మిస్ అవడం బాధాకరం. అయినా సరే పాజిటివ్ దృక్పథంలో ముందుకెళ్తున్నాం. గత కొన్ని రోజులుగా ఆటగాళ్లు ఇక్కడే ఉండటంతో వాతావరణానికి అలవాడు పడ్డారు. వరల్డ్ కప్‌కి ముక్కోణపు సిరిస్ ఆడటం వల్ల ఇక్కడి పరిస్ధితులకు అలవాడు పడ్డారు.

* రేపటి గేమ్‌లో 5-0 వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?

ధోని: లేదు. దాని విషయంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే గత 20 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాం. ఫార్మాట్‌తో పాటుగా క్రీడాకారులు కూడా మారారు. ఆడే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రభావం ఎంత మాత్రం ఆటపై ఉండదని అనుకుంటున్నాను.

 India-Pakistan WC clash: MS Dhoni speaks on high voltage game, nerves and 5-0 lead

* టోర్నమెంట్ మొత్తానికి ఈ గేమ్ ఒక టెంపో సృష్టిస్తుందా?

ధోని: కాదు. కారణం ముక్కోణపు సిరిస్‌తో పాటు వార్మప్ గేమ్‌లు ఆడాం. మీరు చెప్పినట్లుగా పాకిస్ధాన్‌తో ఆడే గేమ్ హై ఓల్టేజ్ గేమ్. ఈ గేమ్‌ను వీక్షించేందుకు భారత్ నుంచి ఫ్యాన్స్ ఇక్కడి వచ్చారు. హౌస్ పుల్. వన్డే ఫార్మెట్‌లో ఈ గేమ్ బహుమతినిచ్చే వాటిల్లో ఒకటి.

* పాకిస్ధాన్‌తో తొలిసారి ఆడుతున్న ఆటగాళ్లు ఆందోళన పడుతున్నారా?

ధోని: అలాంటిదేమీ లేదు. వారికి వన్డే క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్‌లో మైదానంలో 40,000, 50,000 వీక్షకుల ముందు ఆడారు కదా. పెద్ద పెద్ద టోర్నమెంట్లో క్వార్టర్, సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఆడిన అనుభవం ఉంది. ఆసియా కప్‌లో అన్ని రకాల ఫార్మెట్లలో ఆడారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కావాల్సిన అత్యంత అనుభవం వారికి ఉంది.

ఇక భారత కాలమానం ప్రకారం భారత్ - పాక్ మ్యాచ్ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ దూరదర్శన్‌లో ప్రసారం అవుతుంది. కాబట్టి తప్పక వీక్షించండి.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+