For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యుద్ధం ఆగింది...ఐపీఎల్ తిరిగి షురూ అవుతుందా..?

IPL 2025: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్దం ఆగిపోయింది. భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, దీని కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని భారత్, పాకిస్థాన్ దేశాలు వేర్వేరు ప్రకటనల్లో ధ్రువీకరించాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇప్పుడు ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభం కావచ్చు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఐపీఎల్‌ను వారం పాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్, పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత ఐపీఎల్ మళ్లీ ప్రారంభించబడుతుందని తెలుస్తోంది.

భారత్-పాక్ యుద్ధంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమలులోకి వచ్చిందని వెల్లడించారు.ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డీజీఎంవో పోన్ చేసి ఇండియా ఆర్మీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల మిలిటరీ ఆపరేషన్లను నిలిపివేశామన్నారు. ఈ నెల 12న పాకిస్థాన్‌తో చర్చలు జరుగుతాయని వెల్లడించారు.

India-Pakistan War Ceasefire Will IPL 2025 Resume Now

ఐపీఎల్ వారం పాటు నిలిపివేత
మే 8న గురువారం నాడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు రద్దు చేసింది. దీనికి కారణం భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే కారణం. ఐపీఎల్ 2025కు సంబంధించి మరుసటి రోజు మే 9 శుక్రవారం నాడు బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఐపీఎల్‌ను ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి కారణంగా ఐపీఎల్ త్వరలో తిరిగి ప్రారంభమవుతుంది.

మళ్లీ పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్..
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మళ్లీ ఆగిపోయిన మ్యాచ్ ఆడవచ్చు. ఆ మ్యాచ్ రద్దు తర్వాత ఐపీఎల్ అధికారిక వెబ్ సైట్ లో పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ పాయింట్లు రెండు జట్ల ఖాతాలోకి చేర్చబడలేదు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ మళ్లీ డిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరుగుతుందని అంచనా వేయవచ్చు. కానీ దీనికి సంబంధించి బీసీసీఐ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.

ఐపీఎల్ పాయింట్ల పట్టిక
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్, బెంగళూరు జట్లు 16-16 పాయింట్లతో టాప్ 2లో ఉన్నాయి. పంజాబ్ జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ముంబై 14 పాయింట్లతో నాల్గవ స్థానంలో, ఢిల్లీ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో కోల్‌కతా ఇప్పటివరకు 11 పాయింట్లు సాధించి 6వ స్థానంలో ఉంది. కాగా, లక్నో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ జట్లన్నీ ప్లేఆఫ్ రేసులో ఉన్నాయి. హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. కానీ ఈ జట్లకు ఇంకా 2-3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

Story first published: Saturday, May 10, 2025, 19:18 [IST]
Other articles published on May 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+