భారత్-పాక్‌ల మధ్య చూడాలని ఉంది: భారత మాజీ కీపర్

హైదరాబాద్: దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాలకే కాదు.. యావత్ ప్రపంచమంతా అమితాసక్తితో ఎదురుచూస్తుంది. తాను కూడా అలాగే భారత్, పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్‌లు జరిగితే చూడాలని కోరుకుంటున్నట్లు టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ కోరికను బయటపెట్టాడు. 2008లో 'ముంబై దాడులు' జరిగిన తర్వాత ఈ దాయాది దేశాల మధ్య కనీసం ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు.

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వల్ల చర్చలు జరిగుతాయని:
కానీ.. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో మాత్రం భారత్, పాక్ జట్లు తలపడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఉండటంతో దాయాది దేశాల మధ్య క్రికెట్ గురించి చర్చలు జరిగే అవకాశముందని ఫరూక్ ధీమా వ్యక్తం చేశాడు.

పాకిస్తాన్ క్రికెట్‌కు ఆర్థికంగా లాభం
'భారత్ పాక్‌లు ప్రత్యర్థులుగా టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. అది పాకిస్తాన్ క్రికెట్‌కు ఆర్థికంగా లాభం చేకూరుస్తుంది. కానీ.. ఇప్పుడు దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దురదృష్టవశాత్తు బీసీసీఐని భారత ప్రభుత్వం అదుపుచేస్తుండటంతో స్వతంత్ర ఆలోచనలు తీసుకునేందుకు వీలు లేకుండాపోయింది. ఒక క్రికెటర్‌గా నేనైతే భారత్-పాక్‌ల మధ్య జరగాలనే ఆకాంక్షిస్తున్నా. కానీ, మిగిలి ఉన్న సమస్య ఒక్కటేంటంటే రాజకీయ నాయకులను అంగీకరింపజేయడమే.'

నాతో పాటుగా ఇరు దేశాల అభిమానులు
'పాక్ ప్రధానిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఉండటంతో క్రికెట్‌పై ఇరు దేశాల మధ్య త్వరలోనే ఓ చర్చ జరిగే అవకాశం ఉంది. తొలి ప్రతిపాదన కూడా పాక్ నుంచే రావచ్చు. ఎవరైనా ఒక్కటే మనుషులు ఇరు దేశాలలో మంచి నైపుణ్యమున్న క్రికెటర్లున్నారు. అందుకే నాతో పాటుగా ఇరు దేశాల క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ' అని ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశాడు.

భారత్, పాక్‌ల మధ్య టెస్టు మ్యాచ్
2008 తర్వాత ఆసియా కప్, ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీల్లో వన్డే, టీ20లు ఆడిన భారత్, పాకిస్థాన్ జట్లు కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ కూడా తలపడలేకపోయాయి. ఒకవేళ ఇరు దేశాల మధ్య క్రికెట్ గురించి చర్చలు మొదలుకాకపోతే వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ టెస్టు చాంపియన్‌షిప్‌లో కచ్చితంగా తలపడే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications