For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan: వాడు ఇంకో బుమ్రా అవ్వాలి.. రేసు గుర్రానికి గిఫ్ట్ ఇచ్చిన షహీన్!

భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ వాయిదా పడింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వర్షం ఆగినట్లే ఆగి మళ్లీ మొదలవడంతో ఈ మ్యాచ్‌ను రిజర్వ్ డేలో కొనసాగించాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో రెండు జట్ల ఆటగాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు రెడీ అయ్యారు.

ఈ సందర్భంగా పాక్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాచ్ ఆగిపోవడంతో రెండు జట్ల సభ్యలు హోటల్‌కు తిరిగి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. దీంతో బ్యాగులు సర్దుకొని వెళ్తున్న బుమ్రాను అఫ్రిదీ పిలిచాడు. అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆసియా కప్ గ్రూప్ దశలో పాక్‌తో మ్యాచ్ తర్వాత బుమ్రా తండ్రయిన సంగతి తెలిసిందే.

India Pakistan Match Shaheen gives a gift to Jaspreet Bumrah

ఈ క్రమంలోనే బుమ్రాకు కంగ్రాట్స్ చెప్పిన అఫ్రిదీ.. అతనికి గిఫ్ట్ ఇచ్చి కౌగిలించుకొని వెళ్లాడు. 'బాబు పుట్టినందుకు కంగ్రాట్స్. ఆ దేవుడు మీ బాబుపై చల్లని చూపు ఉంచాలి. వాడు భవిష్యత్తులో మరో బుమ్రా అవ్వాలి' అని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అఫ్రిదీ చేసిన పని చాలా బాగుందని, ఆటగాళ్ల మధ్య స్పోర్ట్స్‌మెన్‌షిప్ ఇలాగే ఉండాలని అందరూ మెచ్చుకుంటున్నారు. బుమ్రా కూడా ఈ వీడియోలో చాలా సంతోషంగా కనిపించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. దీంతో బరిలో దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58) ఇద్దరూ కూడా అద్భుతంగా ఆడారు. పాక్ పేసర్లపై వీళ్లిద్దరూ ఎదురుదాడి చేయడంతో భారత్‌కు మంచి ఆరంభం దక్కింది. కానీ వరుస ఓవర్లలో వీళ్లిద్దర్నీ పెవిలియన్ చేర్చిన పాకిస్తాన్.. భారత్‌పై ఒత్తిడి పెంచింది.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. వాళ్లిద్దరూ ఈ పనిలో ఉండగానే వర్షం మొదలైంది. వర్షం పెద్దది అవడంతో అంపైర్లు మ్యాచ్‌ ఆపేశారు. ఆ తర్వాత కాసేపు భారీ వర్షం పడటంతో మైదానంలో కొన్ని చోట్ల గ్రౌండ్ చిత్తడిగా తయారైంది.

దీన్ని ఆరబెట్టేందుకు గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. కానీ మళ్లీ భారీ వర్షం మొదలవడంతో ఇక మ్యాచ్‌ను ఆ రోజుకు ఆపేయాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు. రిజర్వ్ డే నాడు మిగతా మ్యాచ్ జరగనుంది. ఆ మరుసటి రోజునే భారత్, శ్రీలంక మ్యాచ్ ఉండటంతో.. రిజర్వ్ డే వల్ల భారత జట్టుకే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

Story first published: Sunday, September 10, 2023, 22:09 [IST]
Other articles published on Sep 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+