Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: అంపైర్‌ను మింగేసిన షార్క్.. భారత్, పాక్ మ్యాచ్‌‌పై ట్రోలింగ్ వీడియో!

ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్లన్నీ గంటలోనే ఖాళీ అయిపోయాయి. అంతలా ఫ్యాన్స్ ఈ మ్యాచుల కోసం వెయిట్ చేశారు. కానీ గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌ కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. రెండో ఇన్నింగ్స్‌ జరగకుండా వరుణ దేవుడు అడ్డుకున్నాడు. ఆ బాధ నుంచి ఇంకా ఫ్యాన్స్ తేరుకోలేదు.

ఇంతలోనే సూపర్-4 మ్యాచులు మొదలయ్యాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ పూర్తిగా జరిగింది. దీంతో భారత్, పాక్ మ్యాచ్ కూడా జరుగుతుందని అంతా ఆశించారు. కానీ ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ కూడా పూర్తవకముందే వర్షం మొదలైంది. భారీ వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. కవర్స్‌తో మైదానాన్ని ఎంతగా కాపాడినా.. పలు చోట్ల మైదానం బాగా తడిసి చిత్తడిగా తయారైంది.

India Pakistan Match Fans troll rain effect in Asia Cup 2023

దీంతో అంపైర్లు ఇన్‌స్పెక్షన్‌లో అప్పుడే ఈ మ్యాచ్ మొదలవడం కష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మ్యాచ్ ఆలస్యంగా మొదలైతే ఓవర్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిపై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. ముఖ్యంగా ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెద్ద సముద్రం మధ్యలో బాబర్ ఆజమ్, రోహిత్ శర్మ టాస్ వేయడానికి వచ్చారు. ఇద్దరూ నవ్వుతూ నిలబడ్డారు.

కాయిన్ గాల్లోకి లేచిన తర్వాత.. హెడ్స్ లేదా టెయిల్స్ ఏం పడిందో చూసేందుకు వెళ్లిన అంపైర్‌ను ఒక షార్క్ వచ్చి గుటుక్కున మింగేసింది. ఇది చూసిన బాబర్, రోహిత్ ఒకడుగు వెనక్కేశారు. ఆ తర్వాత ఏం జరగనట్లు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. టాస్ గెలిచిన బాబర్ ముందుగా స్విమ్మింగ్ చేస్తామని డిసైడ్ అయ్యాడంటూ వీడియో చివర్లో క్యాప్షన్ వచ్చింది. ఆసియా కప్‌లో వర్షాలను ఇలా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా తెగ నవ్వుకుంటున్నారు.

Story first published: Sunday, September 10, 2023, 21:12 [IST]
Other articles published on Sep 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+