Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: రాహుల్ గాయం అంత సీరియస్సా?.. స్టార్ బ్యాటర్ మాటలు విని ఫ్యాన్స్ షాక్!

టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేసినట్లు అవడంతో రాహుల్ ఆటకు దూరమయ్యాడు. ఇది చూసిన వాళ్లందరూ కూడా అది అంత పెద్ద గాయం కాదనే అనుకున్నారు. కానీ అతనికి శస్త్రచికిత్స అవసరం అని తేలడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయినా సరే ఆ గాయం తీవ్రత మాత్రం ఎవరికీ తెలియదు.

తాజాగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ తన గాయం ఎంత సీరియస్సో వెల్లడించాడు. 'ఆ గాయం చాలా బాధ కలిగించింది. నేను బంతని ఛేజ్ చేస్తుండగా నా తొడ కండరం చటుక్కున తెగింది. అది ఫుల్ ఫ్లెడ్జ్ టీర్. అంటే నా క్వాడ్రిసెప్స్ నుంచి కండ పూర్తిగా తెగింది. ఇలా టెండన్ టీర్ అని తెలిసిన వెంటనే.. నేను, నా ఫ్యామిలీ, ఫ్రాంచైజీ, టీం అందరూ కూడా అది మరీ పెద్దది అవకూడదని కోరుకున్నాం' అని రాహుల్ చెప్పాడు.

 India Pakistan Match Fans shocked to know KL Rahul injury details

'కానీ స్కానింగ్ చూసిన తర్వాత అది పూర్తిగా టెండన్ టీర్ అని తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవాలంటే శస్త్రచికిత్స తప్పదని తేలిపోయింది' అని వివరించాడు. మే నెలలో రాహుల్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలేషన్‌లో ఉన్నాడు. 'ఆపరేషన్ జరిగితే.. శరీరం చాలా ఇబ్బంది పడింది కాబట్టి, అది కోలుకునే వరకు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం' అని రాహుల్ తెలియజేశాడు.

'నీకు పెద్ద రిపైర్ జరిగింది. కాబట్టి శరీరానికి గౌరవం ఇచ్చి, కోలుకోవడానికి అవసరమైనంత సమయం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇక ఆట అంటారా.. పూర్తిగా కోలుకుంటే కొన్ని వారాల్లోనే నేను మళ్లీ మంచి టచ్‌లోకి వస్తానని నాకు నమ్మకం ఉంది' అని చెప్పాడీ 31 ఏళ్ల స్టార్ క్రికెటర్. ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులో ప్రాక్టీస్ సెషన్‌లో రాహుల్‌కు మరో చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీని వల్లనే అతను ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచులకు దూరమయ్యాడు.

'నా శరీరంపై నేను కాన్ఫిడెంట్‌గా ఉండటం, బాగా ఇంటెన్స్‌గా కదిలాల్సి వచ్చినప్పుడు నొప్పి లేకపోవడం చాలా పెద్ద విషయం. రీఎంట్రీలో నేను వికెట్ కీపింగ్ కూడా చేయాల్సి వస్తుందని తెలుసు. నాకు, ఫిజియోలకు ఇదే పెద్ద ఆందోళన కలిగించిన అంశం. నా క్వాడ్రిసెప్ గాయం వల్ల వికెట్ కీపింగ్ చాలా పెద్ద సమస్య అని నాకు తెలుసు. అదే నా బుర్రలో పెద్ద క్వశ్చన్ మార్క్‌గా ఇబ్బంది పెట్టింది' అని రాహుల్ వివరించాడు. ఇది విన్న ఫ్యాన్స్.. రాహుల్ గాయం ఇంత సీరియస్సా? అని షాకవుతున్నారు.

Story first published: Monday, September 11, 2023, 9:51 [IST]
Other articles published on Sep 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+