భారత్-పాక్ మ్యాచ్‌ని ఓ సాధారణ మ్యాచ్‌గానే చూస్తా: పాక్ క్రికెటర్ షోయబ్

హైదరాబాద్: ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ని సాధారణ మ్యాచ్‌గానే చూస్తానని పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అన్నాడు. సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా టీమిండియా 18న హాంకాంగ్‌తో, 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌ని హై ఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఈ మ్యాచ్‌పై షోయబ్ మాలిక్ మాట్లాడుతూ "భారత్‌తో మ్యాచ్ అంటే నేను ఏమీ ప్రత్యేకంగా తీసుకోను. ఎందుకంటే ఒకవేళ భారత్‌ను ప్రత్యేకంగా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది" అని అన్నాడు.

భారత్‌తో ఆడేప్పుడు అంతే
"అందుకే మిగతా దేశాలతో ఆడే సమయంలో ఎలా ఉంటానో, ఎలా సిద్ధం అవుతానో ఇప్పుడు భారత్‌తో ఆడేప్పుడు అంతే. భారత్-పాక్ మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగితే ఇరు దేశాలకు ఎంతో లాభం. ఈ రెండు దేశాలకు చెందిన అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషిస్తారు" అని షోయబ్ చెప్పాడు.

తన రిటైర్మెంట్‌పై స్పందించిన షోయబ్ మాలిక్
అదేవిధంగా తన రిటైర్మెంట్ గురించి కూడా షోయబ్ మాలిక్ స్పందించాడు. 2019 ప్రపంచకప్ తన చివరి అంతర్జాతీయ వన్డే టోర్నీమెంట్ అని ఇప్పటికే పలుమార్లు చెప్పానని షోయబ్ మాలిక్ ఈ సందర్భంగా వెల్లడించాడు. కాగా, ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విరాట్ కోహ్లీకి విశ్రాంతి
వర్క్ లోడ్, రాబోయే ఉన్న సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని సెలక్టర్లు ఈ టోర్నీ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెలక్టర్లు, వైస్ కెప్టెన్‌గా ఓపెన్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశారు. ఈ ఆసియా కప్‌లో భారత్‌తో సహా మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆసియా కప్
ఒక్కో గ్రూపులో మూడు జట్లు ఉంటాయి. టాప్-2లో నిలిచిన రెండు జట్లు కూడా సూపర్-4 స్టేజికి అర్హత సాధిస్తాయి. ఈసారి ఆసియా కప్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి ఆసియా కప్ 1984లో జరిగింది. ఈ టోర్నీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక అయింది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఇప్పటివరకు 13 సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications