రికార్డులు బద్దలు: సరికొత్త చరిత్ర సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్‌షిప్‌ పరంగా సరికొత్త రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 273 మిలియన్ల మంది టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించగా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 50 మిలియన్ల మంది చూశారు.

దీంతోపాటు భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌ కూడా ప్రేక్షకులు బాగానే వీక్షించారు. ఈ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను 25.3 మిలియన్ల మంది లైవ్‌స్ట్రీమింగ్‌లో వీక్షించారు. ఇక, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్‌కప్‌ను 1.6 బిలియన్లకు(160 కోట్లు)పైగా క్రికెట్‌ అభిమానులు ఆదరించారు.

భారత్ మ్యాచ్‌లకు బాగా ఆదరణ

భారత్ మ్యాచ్‌లకు బాగా ఆదరణ

ఈ వరల్డ్‌కప్‌లో భారత్ మ్యాచ్‌లు బాగా ఆదరణ పొందాయి. "హాట్‌స్టార్‌ వంటి డిజిటల్‌ వేదికల్లో భారత్‌లో ఎక్కువగా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌ని లైవ్‌ స్ట్రీమింగ్‌ను అత్యధికంగా 2.53 కోట్ల మంది చూశారు. లైవ్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్‌షిప్‌లో ఇదే అత్యధిక రికార్డు" అని ఐసీసీ వెల్లడించింది.

200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో

200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో

ఈ మెగా టోర్నీని 200 కన్నా ఎక్కువ ప్రాంతాల్లో 26 బ్రాడ్‌కాస్ట్‌ భాగస్వాములతో ప్రసారం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐసీసీ ప్రపంచకప్‌ ఈవెంట్స్‌, లైవ్‌, హైలెట్స్‌ 20,000 గంటలకు పైగా ప్రసారమయ్యాయి. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఈ వరల్డ్‌కప్‌ని 38 శాతం మంది అధికంగా వీక్షించారని ఐసీసీ పేర్కొంది.

వరల్డ్‌కప్ విజయవంతం

వరల్డ్‌కప్ విజయవంతం

అన్ని రకాలుగా ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ విజయవంతమైనట్లు ఐసీసీ తెలిపింది. రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరిగిన ఈ వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌ తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్లు తలపడగా... బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను ఐసీసీ విశ్వవిజేతగా ప్రకటించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 16, 2019, 22:49 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X