న్యూఢిల్లీ: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌ను రికార్డ్ స్థాయిలో అభిమానులు చూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమైంది. దూరదర్శన్‌లోను మ్యాచ్ వీక్షించారు. ఈ మ్యాచ్‌కు వాణిజ్య ప్రకటనల రూపంలో రూ.100 కోట్ల నుండి 110 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ సమయంలో వాణిజ్య ప్రకటనలకు పది సెకన్లకు గరిష్టంగా రూ.25 లక్షలు తీసుకున్నారు. 93 సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకున్నాయి. హెచ్‌డీ ఫీడ్స్‌లో పది సెకండ్లకు 16 నుండి 18 లక్షలు వసూలు చేశారు. రీజినల్ ఫీడ్స్‌లో రూ.1.25 లక్షల వరకు వసూలు తీసుకున్నారు.

మీడియా ప్లానర్స్ ఎస్టిమేషన్ ప్రకారం.. స్టాండర్డ్ ఫీడ్ (స్టార్ స్పోర్ట్స్)కు స్వయంగా దాదాపు రూ.45 కోట్ల నుండి 50 కోట్ల వచ్చి ఉంటాయని, హెచ్‌డీ ఫీడ్, రీజినల్ ఫీడ్స్, డీడీ ఫీడ్స్ ద్వారా మిగతా మొత్తం వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా రూ.40 కోట్ల రెవెన్యూ స్టార్ ఇండియాకు వచ్చి ఉంటుందని, మిగతా మ్యాచుల ద్వారా రూ.15 నుండి 16 కోట్ల వరకు వస్తుంటుందని అంచనా వేస్తున్నారు.