ట్వంటీ20 ప్రపంచ కప్: ఇండియా ఔట్?

ఈ మ్యాచ్‌లోనూ భారత్ బ్యాట్స్‌మెన్ ప్రదర్శనలో ఎలాంటి మార్పులేదు. మళ్లీ అదే తడబాటు. షార్ట్ పిచ్ బంతుల పరీక్షకు నిలవలేక చేతులెత్తేశారు. తమ బలహీనతలను సొమ్ము చేసుకునే అవకాశాన్ని విండీస్ పేసర్లకు ఇచ్చారు. 170 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుగైన ఆరంభం అవసరమైంది. కానీ ఓపెనర్లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. తొలి బంతి నుంచీ తడబడ్డ విజయ్ సామి వేసిన నాలుగో ఓవర్లో ఔటయ్యాక భారత్ వికెట్ల పతనానికి ఏ దశలో అడ్డుకట్ట పడలేదు. వెంటనే గంభీర్ కూడా వెనుదిరిగాడు. అంపైర్ తప్పుడు నిర్ణయానికి రోహిత్ బలయ్యాడు. అప్పటికి స్కోరు 38. రైనా మెరుపులు మెరిపించడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ జట్టు స్కోరు 80 వద్ద రైనా, 81 వద్ద యువరాజ్ ఔట్‌కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 12.4 ఓవర్లలో 81/5. యూసుఫ్, హర్భజన్‌తో కలిసి ధోనీ(18 బంతుల్లో 29; 2X4, 2X6) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఆశలు కల్పించాడు. కానీ చివరి 2 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సిన దశలో రనౌటయ్యాడు. ఆ తర్వాత భారత్ ఓటమి లాంఛనమే! ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడేజా మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు చేసి 27 పరుగులు ఇచ్చాడు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: గేల్ రనౌట్ 98; చందర్‌పాల్ (సి) ధోనీ (బి) నెహ్రా 23; సామి (సి) విజయ్ (బి) జడేజా 19; పొలార్డ్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) జహీర్ 17; బ్రావో (సి) రోహిత్ (బి) నెహ్రా 1; శర్వాణ్ (సి) రోహిత్ (బి) నెహ్రా 0; హిండ్స్ నాటౌట్ 0; రామ్‌దిన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు)169
వికెట్ల పతనం: 1-80, 2-119, 3-160, 4-163, 5-164, 6-165
బౌలింగ్: హర్భజన్ 4-0-16-0; జహీర్ 4-0-36-1; నెహ్రా 4-0-35-3; యూసుఫ్ పఠాన్ 4-0-28-0; రైనా 2-0-23-0; జడేజా 2-0-27-1
భారత్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) పొలార్డ్ (బి) సామీ 7; గంభీర్ (సి) రామ్‌దిన్ (బి) రోచ్ 15; రైనా (సి) సామీ (బి) గేల్ 32; రోహిత్ (సి) రామ్‌దిన్ (బి) పొలార్డ్ 5; యువరాజ్ (సి) చందర్‌పాల్ (బి) బెన్ 12; ధోనీ రనౌట్ 29; యూసుఫ్ పఠాన్ (సి) హిండ్స్ (బి) టేలర్ 17; హర్భజన్ (సి) బ్రావో (బి) రోచ్ 14; జడేజా నాటౌట్ 5; నెహ్రా (సి) బెన్ (బి) బ్రావో 0; జహీర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 19 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155
వికెట్ల పతనం: 1-12, 2-27, 3-38, 4-80, 5-81, 6-114, 7-139, 8-150, 9-152
బౌలింగ్: సామీ 3-0-16-1; టేలర్ 4-0-24-1; రోచ్ 4-0-38-2; బ్రావో 4-0-28-1; పొలార్డ్ 2-0-23-1; గేల్ 2-0-22-1; బెన్ 1-0-2-1
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications