ధోనీకి వన్డేల్లోనూ స్థానం దూరం కానుందా..??


న్యూ ఢిల్లీ: ఇప్పటికే టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్ ధోనీకి ఇక వన్డేల్లోనూ దూరం కాబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో అక్టోబరు 21 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ కోసం త్వరలోనే జట్టుని సెలక్టర్లు ప్రకటించనున్నారు. అయితే.. ఈ జట్టులో మహేంద్రసింగ్ ధోనీకి చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కోహ్లీతో పాటు మరికొంత మందికి విశ్రాంతినిస్తున్నట్లు అధికారిక సమాచారం రానే వచ్చింది.

తొలి టెస్టులో 92 పరుగులతో.. పంత్
ఇటీవల ఇంగ్లాండ్‌పై చివరి టెస్టులో సెంచరీ బాది వెలుగులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. గత వారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో.. వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా అతనికి అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండంతో సెలక్టర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న ధోనీ
మరోవైపు మహేంద్రసింగ్ ధోనీ కూడా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. గత నెల దుబాయ్‌లో ముగిసిన ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై డకౌటైన ధోనీ.. టోర్నీలో భారత్‌ని గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు.

రిషబ్ పంత్‌తో ధోనీ కెరీర్‌కి ఎలాంటి ప్రమాదం
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రిషబ్ పంత్‌తో ధోనీ కెరీర్‌కి ఎలాంటి ప్రమాదం ఉండదు. 2019 ప్రపంచకప్ వరకూ ధోనీ ఆడతాడని మన అందరికీ తెలుసని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఒకవేళ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చినా.. ప్రపంచకప్‌లో మాత్రం ధోనీనే ఆడిస్తామని మరో అధికారి వెల్లడించారు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోటాలో ఐదు నెలలుగా దినేశ్ కార్తీక్ వన్డే జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ధోనీని వన్డే జట్టు నుంచి దూరం చేస్తే..
ఒకవేళ ధోనీని ఇప్పటి వన్డే జట్టు నుంచి దూరం చేస్తే ఆ స్థానానికి పంత్ సరిపోతాడా.. దినేశ్ కార్తీక్‌నే కొనసాగిస్తారా అనేది సెలక్షన్ కమిటీయే చూసుకోవాలి. ఇప్పటికే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జట్టు నుంచి తీసేశారంటూ ఇద్దరు క్రికెటర్లు సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications