న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో సిరీస్‌: అబాట్‌కు గాయం.. షార్ట్‌కు జట్టులో చోటు!!

India ODI series: Australia include big-hitter DArcy Short as injury replacement for Sean Abbott

మెల్‌బోర్న్‌: వచ్చే జనవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ పర్యటనకు 15 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పర్యటనకు ముందే ఆసీస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్‌ సీన్ అబాట్‌ గాయపడ్డాడు.

<strong>చేజారిన బ్లిట్జ్‌ టైటిల్‌.. హంపికి 12వ స్థానం!!</strong>చేజారిన బ్లిట్జ్‌ టైటిల్‌.. హంపికి 12వ స్థానం!!

అబాట్‌ స్థానంలో షార్ట్‌

అబాట్‌ స్థానంలో షార్ట్‌

బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న సీన్ అబాట్‌ శుక్రవారం గాయపడ్డాడు. అతడికి వెన్ను గాయం అయినట్టు సమాచారం తెలుస్తోంది. అబాట్‌కు నాలుగు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో అబాట్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ డి'ఆర్సీ షార్ట్‌కు జట్టులో చోటు కల్పిస్తున్నట్లు సీఏ సోమవారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న అబోట్‌ను కోల్పోవడం దురదృష్టకరమని ఆస్ట్రేలియా సెలెక్టర్ ట్రెవర్ హోన్స్ అన్నారు.

పటిష్టంగానే పేస్ బౌలింగ్

పటిష్టంగానే పేస్ బౌలింగ్

భారత్‌ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో ఇప్పటికే మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్‌లు ప్రధాన పేసర్లు ఉన్నారు. దీంతో లెగ్-స్పిన్నర్, విధ్వంసక ఆల్‌రౌండర్‌గా పేరున్న షార్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా ఆడమ్‌ జంపా ఇప్పటికే ఉన్నాడు. అబాట్‌ గాయపడినా.. ఆసీస్ బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగానే ఉంది.

జనవరి 14న తొలి వన్డే:

జనవరి 14న తొలి వన్డే:

ఈ పర్యటన జనవరి 14న మొదలై.. 19తో ముగుస్తుంది. జనవరి 14న తొలి వన్డే (ముంబై), 17న రెండో వన్డే (రాజ్‌కోట్‌), 19న మూడో వన్డే (బెంగళూరు)లో జరగనుంది. భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత పర్యటనలో ఆసీస్‌ హెడ్ కోచ్‌గా సీనియర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మెక్‌ డొనాల్డ్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఆసీస్‌ జట్టు:

ఆసీస్‌ జట్టు:

ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్, డి'ఆర్సీ షార్ట్‌, ఆస్టన్‌ అగర్‌, అలెక్స్‌ క్యారీ, పాట్‌ కమిన్స్‌, హ్యాండ్స్‌కాంబ్‌, జొస్ హేజిల్‌వుడ్‌, మార్నస్‌ లబుషేన్‌, కేన్‌ రిచర్డ్సన్‌, మిచెల్ స్టార్క్‌, ఆస్టన్‌ టర్నర్‌, ఆడమ్‌ జంపా.

Story first published: Tuesday, December 31, 2019, 9:35 [IST]
Other articles published on Dec 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X