T20 World Cup: వారిద్దరు ఓపెనింగ్ చేస్తే.. సూర్యకుమార్‌దే మూడో స్థానం!!

ముంబై: టీ20 ప్రపంచకప్‌లో మూడో స్థానానికి సూర్యకుమార్ యాదవ్ సరైనోడు అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే.. సూర్యకుమార్‌ను మూడో స్థానంలో ఆడించాలని సూచించాడు. కేఎల్ రాహుల్ పోటీలో ఉన్నా.. సూర్య మాత్రం మూడో స్థానంలో ఉండాల్సిందేనని మంజ్రేకర్ అన్నాడు. ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్ 2021 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ దేశాలకు తరలివెళ్లింది. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు మెగా టోర్నీ జరగనుంది.

సూర్యనే సరైనోడు:
ఓ జాతీయ మీడియాతో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్‌లోని మూడో స్థానానికి సూర్యకుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. టీమ్ మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్‌ను ఎలా ఉపయోగించుకుంటారో నాకు తెలియదు. సూర్యకుమార్‌కు మాత్రం కచ్చితంగా చోటివ్వాలి. ఒక ఐపీఎల్ సీజన్ మొత్తం సూర్యలా బ్యాటింగ్ చేసిన వారిని నేను చూడలేదు. సూర్య కట్టుదిట్టమైన బంతుల్నీ బౌండరీకి తరలించగలడు. అందుకే అతడికి మూడో స్థానమే సరైంది' అని అన్నాడు.

కీపర్‌గా ఇషాన్ కిషన్ బెస్ట్:
శ్రీలంక సిరీసులో సంజు శాంసన్ బదులు ఇషాన్ కిషన్‌కే కీపర్‌గా ఓటేస్తానని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. టెస్టు క్రికెట్లో వికెట్ కీపింగ్‌కు ఉన్నంత ప్రాధాన్యం వన్డే, టీ20ల్లో ఉండదని తెలిపాడు. 'శ్రీలంక సిరీసులో కీపర్‌గా నా ఎంపిక ఇషాన్ కిషనే. ఎందుకంటే నిలకడైన బ్యాటర్‌నే నేను ఎంచుకుంటా. సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడే. స్వింగ్‌లో ఉంటే అతడికన్నా ఎవరూ మెరుగ్గా ఉండరు. నిలకడ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం కిషన్‌కు ప్రాధాన్యం ఇస్తా' అని వ్యాఖ్యాత మంజ్రేకర్ పేర్కొన్నాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య జూలై 18న తొలి వన్డే ప్రారంభం కానుంది.

అతడికి చోటు దక్కడం సంతోషం:
కుల్దీప్ యాదవ్‌కు వన్డే జట్టులో చోటిచ్చినందుకు సంతోషంగా ఉందని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. 'కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ వన్డే జట్టులో చోటు దక్కడం సంతోషంగా ఉంది. రాణిస్తాడనే నమ్మకం ఉంది. బ్యాట్స్‌మన్‌గా హార్దిక్ పాండ్యా సత్తా ఏంటో ఆస్ట్రేలియా సిరీసులో నిరూపించుకున్నాడు. అతడు బౌలింగ్ సైతం మొదలు పెట్టాడు. దాదాపుగా టీ20 ప్రపంచకప్ తుది జట్టుపై స్పష్టత వచ్చినట్టే. గతంలో ఎన్నడూ లేనంత బలంగా భారత టీ20 జట్టు ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ తరహాలో సందిగ్ధం లేదు' అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక లంక పర్యటనలో ఓపెనర్‌గా దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని మరో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత అజయ్ జడేజా అన్నాడు. పృథ్వీ షా ఉన్నప్పటికీ భవిష్యత్తు దృష్ట్యా అతడికి చోటివ్వడం మంచిదన్నాడు.

బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్:
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్ మొత్తం జరుగనుంది. టోర్నీ మ్యాచ్‌లు మొత్తం నాలుగు వేదికల్లో జరగనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ద షేక్ జాయెద్ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. టోర్నమెంట్ తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడుతాయి. ఈ జట్ల నుంచి నాలుగు టీమ్‌లు.. సూపర్12కు ఎంపికవుతాయి. ఆ జట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయర్స్‌తో కలుస్తాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications