For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఆడితేనే భారత్ గెలుపు: మంచిది కాదన్న దాదా

By Nageshwara Rao

రాంచీ: రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరుగుల ఛేదనలో టీమిండియా ప్రతి గేమ్ లోనూ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడటం మంచిది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేర్కొన్నాడు.

ఆశలు రేపి తుస్సుమనిపించారు: 4వ వన్డేలో భారత్ ఓటమి

రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో రెండో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ధోని సహా మిగతా ఆటగాళ్లు రాణించకపోవడంతో భారత్ ఓటమి పాలైంది. దీంతో కోహ్లీపై ఆధారపడటం మంచిది కాదని ఆటగాళ్లకు గంగూలీ సూచించాడు.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరిస్‌లో టీమిండియా గెలిచిన రెండు వన్డేల్లో కోహ్లీ రాణించడంతోనే గెలిచింది. ధర్మశాల వన్డేలో 85, మొహాలి వన్డేలో 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతుంది.

దీంతో భారమంతా కోహ్లీపైనే పడుతుందని, భారత్ గెలిచిన ప్రతిసారి కోహ్లి సెంచరీ అనేది సర్వసాధారణంగా మారిపోయిందని గంగూలీ కొనియాడాడు. అందుకే కోహ్లీ గొప్ప ఆటగాడు అంటూ గంగూలీ పొగడ్తలతో ముంచెత్తాడు. మొహాలిలో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ 154 నాటౌట్‌గా నిలవడంతో టీమిండియా విజయం సాధించిందని పేర్కొన్నాడు.

India not dependent only on Virat Kohli: Sourav Ganguly

ఆ మ్యాచ్‌లో రాస్ టేలర్ గనుక కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితమే వేరొలా ఉండేదని గంగూలీ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా టీమిండియా కోహ్లీపైనే ఆధారపడుతుందని అనడానికి మొహాలిలో అతడు ఆడిన ఇన్నింగ్సే ఉదాహరణ అన్నాడు. పరుగుల ఛేదనలో కోహ్లీ మెరుగైన రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, జట్టుకు కీలక విజయాల్ని అందిస్తున్నాడని తెలిపాడు.

రన్ ఛేజ్‌లో కోహ్లీపై ఆధారపడ్డారా?: ధోని ఆన్సర్ ఇదీ

'జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని అనుకుంటున్నా. న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లినే రెండు మ్యాచ్‌ల్లో ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొహాలిలో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ క్యాచ్‌ను రాస్ టేలర్ వదిలేశాడు. ఒకవేళ ఆ క్యాచ్‌ను పట్టి ఉంటే జట్టులోని మిగతా ఆటగాళ్లు ఏం చేసేవారో నాకైతే తెలీదు. అంతా సమష్టిగా పోరాడి విజయం కోసం కృషి చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి' అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇక ఈ సిరిస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యాడని, ఇంకా గాడిలో పడలేదన్నాడు. ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు రావడం జట్టుకు మంచిదేనని అన్నాడు. రాంచీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు తీసుకురావడం తప్పుకాదని గంగూలీ తెలిపాడు.

కుడి చేతి, ఎడమ చేతి ఆటగాళ్లు క్రీజ్‌లో ఉంటే ఈ తరహా వికెట్‌పై స్ట్రయిక్ రొటేట్ చేయడం సులభం అవుతుందనే కారణంగానే ధోని అలా చేసి ఉండవచ్చని అన్నాడు. యువ ఆటగాళ్లు కేదార్ జాదవ్, మనీష్ పాండే స్లో పిచ్‌లపై కూడా చక్కగా రాణించారని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+