WTC Final 2021 ముందు ఫొటోషూట్‌..టీమిండియా ఆటగాళ్ల పోజులు చూస్తే నవ్వులేనవ్వులు!వేరే లెవెల్(వీడియో)

సౌథాంప్టన్‌: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ మెగా పోరుపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ ఇద్దరూ సారథులుగా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. ఈ నేపథ్యంలో అరంగేట్రం ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో గెలిచి ఆ కొరత తీర్చుకోవాలని భావిస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముందు భారత్, న్యూజిలాండ్ జట్ల ఆటగాళ్ల ఫొటోషూట్‌ వీడియోను ఐసీసీ ట్వీట్‌ చేసింది. సందడి సందడిగా ఆటగాళ్లంతా అందులో పాల్గొనడం విశేషం. పేసర్ ఇషాంత్‌ శర్మ పోజులిస్తున్నప్పుడు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ నవ్వుతూ కనిపించాడు. అతడు పోజులు పెట్టిన ప్రతిసారీ నవ్వాడు. ఇక మయాంక్‌ పోజులిస్తున్నపుడు అతడి జుట్టును ఇషాంత్ దువ్వడం విశేషం. జస్ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే, విరాట్‌కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌ కెమెరాకు చక్కని పోజులిచ్చారు. న్యూజిలాండ్‌ ఆటగాళ్లు సైతం ఆనందంగా ఆనందంగా షూట్‌లో పాల్గొన్నారు.

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మరో సాధారణ మ్యాచ్‌గా భావిస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ మ్యాచును ఆడతామని, మరీ అతి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపాడు. ఇందులో గెలిచినా, ఓడినా క్రికెట్‌ ప్రపంచం ఆగిపోదని స్పష్టం చేశాడు. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారని, చావోరేవో అన్నట్టు భావిస్తారని విరాట్ పేర్కొన్నాడు. వాతావరణం వల్ల తమ జట్టు కూర్పులో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదని వెల్లడించాడు.

India, New Zealand players Photo Shoot ahead of WTC Final 2021. Ishant Sharma and Mayank Agarwal not stop comedy goes viral.

కాసేప‌ట్లో టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచి ఉండ‌టమే ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ్యాచ్ జ‌రిగే ఐదు రోజులూ సౌథాంప్ట‌న్‌లో వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ చెప్పింది. అక్యువెద‌ర్ అనే వాతావ‌ర‌ణ వెబ్‌సైట్ ప్ర‌కారం తొలి రోజు వ‌ర్షం ప‌డే అవ‌కాశం 65 శాతం ఉంది. రెండో రోజు 60 శాతం, మూడో రోజు 56 శాతం, నాలుగో రోజు 65 శాతం, ఐదో రోజు 63 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు మ్యాచ్ ఫ‌లితంపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి. మ్యాచ్ కోసం ఆరో రోజును రిజ‌ర్వ్ డేగా ఉంచిన విష‌యం తెలిసిందే. ఆ రోజు మాత్రం కేవ‌లం 25 శాతం మాత్ర‌మే వ‌ర్షం ప‌డే చాన్స్ ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 18, 2021, 13:57 [IST]
Other articles published on Jun 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X