న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓడినంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

ICC Cricket World Cup 2019 : No Need To Panic,Says Sachin After India's Defeat In 1st Warm-up Match
India need not press panic button despite loss to New Zealand in warm-up match says Sachin Tendulkar

ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా స్వింగ్‌ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నమెంట్ ఇంకా మొదలు కాలేదు:

టోర్నమెంట్ ఇంకా మొదలు కాలేదు:

ఈ ఓటమిపై టీమిండియా మాజీ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ స్పందించారు. సచిన్ ఆదివారం ముంబై టీ20 లీగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... 'ప్రతి మ్యాచ్‌ను నేను జడ్జ్ చేయను. ఇది ఒక మెగా టోర్నమెంట్. ఒక్కోసారి అలా జరిగిపోతుంటుంది. భారత్ ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓడినంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గొప్పగా పుంజుకుంటుంది. టోర్నమెంట్ ఇంకా మొదలు కాలేదనే విషయం గుర్తుంచుకోవాలి' అని సచిన్ అన్నారు.

గాడిలో పడుతారు:

గాడిలో పడుతారు:

'అసలు సమరంకు ముందు భారత్‌కు ఇంకా ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌తో గాడిలో పడుతారు. అక్కడి పరిస్థితులు అర్ధం చేసుకుంటారు. బ్యాటింగ్‌లో చాలా జట్లు కొత్త కాబినేషన్లను పంపుతున్నాయి. అన్ని జట్లు బౌలర్, బ్యాట్స్‌మన్‌లకు విశ్రాంతిని ఇచ్చాయి. ఇప్పుడు ఆడుతున్న జట్లు ఫైనల్ కాదు. అక్కడి పిచ్‌లు మ్యాచులు గడుస్తున్నా కొద్దీ మారుతాయి. స్పిన్నర్లు రాణించే అవకాశం ఉంది' అని సచిన్ తెలిపారు.

పెద్ద జట్లకు షాక్‌ ఇస్తుంది:

పెద్ద జట్లకు షాక్‌ ఇస్తుంది:

'ఆఫ్గానిస్తాన్‌ సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది. వార్మప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై వచ్చిన ఫలితమే ఇందుకు నిదర్శనం. స్పిన్‌ విభాగంలో ఆఫ్గాన్‌ అత్యంత పటిష్టంగా ఉంది. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌లు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లు. ఆఫ్గాన్‌ ఎన్ని విజయాలు నమోదు చేస్తుందో చెప్పలేను.. కానీ సంచల రీతిలో కొన్ని విజయాలను సాధిస్తుంది. పెద్ద జట్లకు షాక్‌ ఇచ్చే సత్తా ఆఫ్గాన్‌ జట్టుకుంది' అని సచిన్ పేర్కొన్నారు.

Story first published: Monday, May 27, 2019, 14:38 [IST]
Other articles published on May 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X