For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'2019 వరల్డ్‌కప్‌లో ధోనిని ఆడించాలి'

India need to include MS Dhoni in the World Cup 2019 squad, says Stephen Fleming

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ ధోనీని ఆడించాలని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఇటీవల వెస్టిండీస్‌‌, ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌ నుంచి ధోనీని తప్పించిన సెలక్టర్లు అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో పలువురు ధోని క్రికెట్ కెరీర్‌ ముగిసిందని.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లోనూ అతను ఆడటం అనుమానమేనంటూ మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లాంటి మెగా టో్ర్నీలో అనుభవజ్ఞుడైన ధోనీ జట్టులో ఉండటం టీమిండియాకి అవసరమని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ నాటికి ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని, ఆ మెగా టోర్నీలో అతను తప్పకుండా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఫ్లెమింగ్ మాట్లాడుతూ "ఐపీఎల్ 2018 సీజన్‌లో ధోనీ బ్యాటింగ్‌ని ఓసారి పరిశీలిస్తే.. ఎంత నిలకడగా ఆడాడో తెలుస్తుంది. వన్డేల్లోనూ స్వేచ్ఛగా ఆడేందుకు అతనికి అవకాశమివ్వాలి" అని అన్నాడు.

"2019 వరల్డ్‌కప్ దానికి సరైన వేదిక. ధోనీ వ్యూహ చతురత, ఫినిషింగ్ నేపథ్యం కారణంగా మెగా టోర్నీలో ధోనిని తప్పకుండా టీమిండియా జట్టులోకి తీసుకుంటుందని అనుకుంటున్నా. ఒకవేళ అదే జరిగితే, వరల్డ్ కప్‌లో ధోనీ చెలరేగడం ఖాయం" అని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఫ్లెమింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, December 1, 2018, 16:28 [IST]
Other articles published on Dec 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+