Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ టోర్నీ ప్రారంభం నుంచి భారతే ఫేవరెట్‌: కమ్రాన్‌ ఆక్మల్‌

 India my favourite team since the start of World Cup 2019 says Kamran Akmal


ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2019 టోర్నీ ప్రారంభం నుంచి భారతే ఫేవరెట్‌ అని పాకిస్తాన్‌ మాజీ వికెట్ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ అన్నారు. బుధవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌తో భారత్ విజయం సాధించాలని ఆక్మల్‌ ఆకాంక్షించాడు. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరుతుందని చాలా మంది మాజీలు అభిప్రాయపడ్డారు. భారత్‌ ప్రస్తుత ఫామ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌ ఫైనల్స్‌కి వెళ్తుంది అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌, కెవిన్ పీటర్సన్, సచిన్ అన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారతే ఫేవరెట్‌:

తాజాగా కమ్రాన్‌ ఆక్మల్‌ మాట్లాడుతూ... 'బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమిండియా సమతూకంగా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీలు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇక ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి యార్కర్లకు బ్యాట్స్‌మన్‌ వద్ద సమాధానం లేకుండా పోతోంది. కచ్చితంగా భారత్ ఫైనల్ చేరుతుంది. ప్రపంచకప్‌ ప్రారంభం నుంచి భారతే నా ఫేవరెట్‌' అని కమ్రాన్‌ పేర్కొన్నాడు.

లేటుగా ఫామ్:

లేటుగా ఫామ్:

'పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం నిరాశ కలిగించింది. ప్రపంచకప్‌లో పాక్‌ ఆటగాళ్లు లేటుగా ఫామ్ అందుకున్నారు. టోర్నీ ఆది నుంచి ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడితే పాక్‌ సెమీస్‌లో ఉండేది. కానీ దురదృష్టం వెంటాడింది. న్యూజిలాండ్‌, పాక్‌ జట్లు సమాన పాయింట్లు సాధించినా.. రన్‌రేట్‌ ఆధారంగా కివీస్‌ సెమీస్‌కు చేరింది' అని అక్మల్ అన్నారు. తొలి సెమీస్‌తో భారత్ విజయం సాధించాలని ఆక్మల్‌ కోరుకున్నారు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన పాక్ 11 పాయింట్లు సాధించింది.

రిజర్వ్‌డేకు వాయిదా:

రిజర్వ్‌డేకు వాయిదా:

ఇక ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్‌డే (బుధవారం)కు వాయిదా పడింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలు మార్లు వర్షం వచ్చి వెళుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను బుధవారంకు వాయిదా వేశారు. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్‌ టేలర్‌ (67), లాథమ్‌ (3)లు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌తో మ్యాచ్ మొదలవుతుంది.

Story first published: Wednesday, July 10, 2019, 11:55 [IST]
Other articles published on Jul 10, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+