For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముక్కోణపు టీ20 సిరిస్: 'ధోని స్థానంలో పంత్‌ను ఆడించాలి'

By Nageshwara Rao
India must play Rishabh Pant in Sri Lanka: Sanjay Manjrekar

హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరిస్‌లో చోటు దక్కించుకున్న భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ఎక్కువ అవకాశాలివ్వాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. శ్రీలంక వేదికగా భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మంగళవారం నుంచి ముక్కోణపు టీ20 టోర్నీ జరగనుంది.

ఈ సిరిస్ కోసం జట్టు ఎంపిక చేసిన సెలక్టర్లు ధోనికి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ ఉంటాడని.. రిషబ్ పంత్‌ను కేవలం బ్యాట్స్‌‌మెన్‌గా మాత్రమే ఎంపిక చేసినట్లు సెలక్టర్లు పేర్కొన్నారు.

అయితే యువ క్రికెటర్ రిషబ్ పంత్‌కు ఎక్కువ ఛాన్స్‌లిచ్చి అతడిని ధోనికి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా తయారు చేయాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు. 'వన్డే, టీ20ల్లో ధోని, టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా.. ఈ ఇద్దరిలో ఎవరు గాయడినా వారికి ప్రత్యామ్నాయంగా దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్ అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ టీమిండియాకు త్వరలోనే ఓ నైపుణ్యం కలిగిన వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కావాలి' అని తెలిపాడు.

'అందుకే కార్తీక్, పార్థీవ్‌కు అవకాశం ఇవ్వడం కంటే.. యువ క్రికెటర్ రిషబ్‌కి ఎక్కువ ఛాన్సిలిచ్చి అతడిని వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ తయారు చేస్తే మంచింది. ఇందులో భాగంగా ముక్కోణపు టీ20 టోర్నీ మొత్తం అతడ్ని ధోని స్థానంలో వికెట్ కీపర్/బ్యాట్స్‌ మన్‌గా అతడిని ఆడించాలి' అని మంజ్రేకర్ సూచించాడు.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ ఆటగాళ్లు ధోని, భువనేశ్వర్, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ ఈ సిరిస్‌లో కొత్త కుర్రాళ్లకు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌తో పాటు దీపక్ హుడా, సుందర్, విజయ్ శంకర్, రిషబ్ పంత్‌లు చోటు దక్కించుకున్నారు.

శ్రీలంక స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మంగళవారం ఆతిథ్య శ్రీలంక, భారత్ మధ్య జరగనుంది. ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి సార్లు ఆడుతాయి. టాప్‌లో నిలిచిన రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడుతాయి.

ఫైనల్‌ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

ముక్కోణపు టీ20 సిరిస్‌కు భారత జట్టు:
Rohit Sharma (captain), Shikhar Dhawan (vice-captain), KL Rahul, Suresh Raina, Manish Pandey, Dinesh Karthik (wk), Deepak Hooda, Washington Sundar, Yuzvendra Chahal, Axar Patel, Vijay Shankar, Shardul Thakur, Jaydev Unadkat, Mohammad Siraj, Rishabh Pant (wk).

Story first published: Monday, March 5, 2018, 15:09 [IST]
Other articles published on Mar 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+