Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : భారత్ మళ్లీ బ్యాటింగ్ చేసే అవసరం రాదు.. ఆసీస్ దిగ్గజం కామెంట్స్!

India may not bat for the second time in INDvsAUS Test

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పైచేయి సాధించింది. తొలి రోజు ఆటలో ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌ను కూడా చక్కగా ఆరంభించింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది చూసిన చాలా మంది టీమిండియా జోరు చూస్తుంటే రెండో సారి ఆ జట్టు బ్యాటింగ్ చేసే అవసరమే రాదని అభిప్రాయపడ్డారు.

మళ్లీ బ్యాటింగ్ చేయాలా?

మళ్లీ బ్యాటింగ్ చేయాలా?

దినేష్ కార్తీక్ దీని గురించి మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారే బ్యాటింగ్ చేస్తుందని, రెండో సారి బ్యాటింగ్ చేసే అవసరం ఉండబోదని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన మరో దిగ్గజం కూడా అదే మాట అన్నాడు. టీమిండియా కనుక తమ తొలి ఇన్నింగ్స్‌లో 280-300 స్కోరు చేస్తే.. వాళ్లకు రెండో సారి బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాదని ఆసీస్ లెజెండ్ మైకేల్ క్లార్క్ అన్నాడు.

కమిన్స్ వ్యూహాలు..

కమిన్స్ వ్యూహాలు..

'స్కోరు బోర్డుపై మంచి స్కోరు ఉంటే ప్యాట్ కమిన్స్ పని కొంత సులువయ్యేది. కానీ అలా జరగలేదు. దీంతో అతని పని కష్టంగా మారింది. అందుకే తన బౌలర్లకు కొంత భద్రత ఇవ్వడానికి కమిన్స్ ప్రయత్నిస్తున్నాడు. కానీ బ్యాటర్లు రిస్క్ తీసుకుంటేనే ఈ ప్లాన్లు ఫలిస్తాయి' అని క్లార్క్ వివరించాడు. ఆసీస్ జట్టు కేవలం 177 పరుగులే చేసినా కూడా వికెట్లు తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నించాలని సూచించాడు. కమిన్స్ వ్యూహాలు చూసి తాను ఆశ్చర్యపోయానని క్లార్క్ అన్నాడు. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ వేసిన ప్రతి ఓవర్లోనూ లాంగాన్‌లో ఫీల్డర్‌ను ఉంచాడని చెప్పాడు.

బ్యాటర్లు రిస్క్ తీసుకుంటేనే..

బ్యాటర్లు రిస్క్ తీసుకుంటేనే..

బంతి అనుకున్నంత స్పిన్ అయితే బ్యాటర్లు మిడాన్ మీదుగా ఆడే అవకాశం ఇవ్వాలని క్లార్క్ సూచించాడు. 'అప్పుడే ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లకు తగిలే అవకాశం ఉంది. బ్యాటర్ మిస్ అయితే స్టంపౌట్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్లీన్ బౌల్డ్ అవ్వొచ్చు, బ్యాట్‌-ప్యాడ్ తగిలి క్యాచ్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది' అని క్లార్క్ విశ్లేషించాడు. కాగా, తొలి రోజు ఆటలో టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. అదే ఆసీస్‌కు కొంత ఊరట అని నిపుణులు అంటున్నారు. అది తప్ప మిగతా ఆటలో అంతా భారత్‌ పైచేయి సాధించిందని చెప్తున్నారు.

Story first published: Friday, February 10, 2023, 9:05 [IST]
Other articles published on Feb 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+