న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2024 ఒలంపిక్స్ కోసం భారత్ బిడ్, ప్రధాని మోడీని కలవనున్న ఐఓసి చీఫ్

By Nageswara Rao

న్యూఢిల్లీ: 2024లో జరగనున్న ఒలంపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2024లో భారత్‌లో ఒలింపిక్స్ వేడుకలను నిర్వహించేందుకు భారత్ ప్రధాని నరేంద్రమోడీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపింక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ దృష్టికి తీసుకెళ్లారు. 2013లో అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడిగా బాచ్ నియమితులయ్యారు. ఐఓసి అధ్యక్షుడైన తర్వాత బాచ్ తొలిసారి ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు భారత్‌కు వస్తున్నారు.

ప్రధాని నరేంద్రమోడీతో బాచ్ ఏప్రిల్ 27న సమావేశం కానున్నారు. తాను ఇప్పటికే ఐఓసి అధికారులను గత నెలలో లిసి, 2024 ఒలంపిక్స్ బిడ్ విషయంలో ప్రాథమిక చర్చలు జరిపినట్లు కేంద్ర క్రీడా శాఖ కార్యదర్శి అజిత్ శరణ్, భారత ఒలంపిక్ అధ్యక్షుడు ఎన్ రామచంద్రన్‌లు వెల్లడించారు.

India may bid for 2024 Olympics, IOC chief to meet Modi

ప్రధాని నరేంద్రమోడీ, ఐఓసి అధ్యక్షుడు బాచ్‌తో సమావేశం అవుతున్న విషయాన్ని ధృవీకరించిన రామంచంద్రన్, 2024లో నిర్వహించనున్న ఒలంపిక్స్ బిడ్‌పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలిసారి భారత పర్యటనకు వస్తున్న ఐఓసి అధ్యక్షుడు బాచ్‌కు భారత్ ఆతిథ్యం ఎలా ఉంటుందో తెలియజేయాలని అంటున్నారు.

ఆయన కూడా 120 కోట్ల జనాభా ఉన్న భారత్‌ కోరికను ఎలా కాదనగలం అని అన్నట్లు తెలుస్తోంది. ఇక 2024 ఒలంపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఈ ఏడాది అక్టోబర్ లోగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిలోంచి కొన్ని పట్టణాలను ఐఓసి 2016 నాటికి చిన్న జాబితాగా రూపొందిస్తుంది. 2017 జులైలోగా ఒలంపిక్స్‌ను నిర్వహించనున్న దేశాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X