'పైన్.. నువ్వు తాత్కాలిక కెప్టెన్‌వి.. నేను ప్రపంచ బెస్ట్ బ్యాట్స్‌మన్'


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కించపరిచాడని వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అంటూ ప్రగల్బాలకు పోలేదని స్పష్టం చేసింది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇద్దరు కెప్టెన్లు మాటల యుద్ధం చేశారు. ఒకర్నొకరు కవ్వించుకున్నారంతే. ఈ నేపథ్యంలో ఆసీస్ మీడియా విరాట్ లక్ష్యంగా వార్తలు ప్రసారం చేసింది.

కోహ్లీ అన్నట్టు వచ్చిన వార్తలు నిరాధారం
‘ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని నేను. నువ్వు కేవలం తాత్కాలిక కెప్టెన్‌వి అని కోహ్లీ అన్నట్టు వచ్చిన వార్తలు నిరాధారం. అవన్నీ వదంతులు. మైదానంలో కోహ్లీ అలాంటి మాటలు మాట్లాడలేదని మీ దృష్టికి తెస్తున్నాం. మాటల యుద్ధంపై జట్టు యాజమాన్యం బీసీసీఐ నుంచి వివరణ కోరింది. అవన్నీ వదంతులే. నిరాధారమని తెలిసింది' అని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంప్రదాయం ప్రకారం బీర్ పార్టీకి ఆహ్వానిస్తామని
విరాట్ కోహ్లీ సైతం తాను వ్యక్తిగత దూషణ చేయలేదని, ఎలాంటి కించపరిచే మాటలు అనలేదని స్పష్టం చేశాడు. ఇవన్నీ ఆటలో భాగమని ఆసీస్ కెప్టెన్ టిమ్‌పైన్ పేర్కొన్నాడు. మాటల యుద్ధం సరదాగా జరిగిందని తీవ్రమైంది కాదంటూ తెలిపాడు. సిరీస్ ముగిసిన తర్వాత సంప్రదాయం ప్రకారం టీమిండియాను బీర్ పార్టీకి ఆహ్వానిస్తామని వెల్లడించాడు.

వ్యక్తిగత దూషణలు లేనంత వరకు హద్దు దాటనట్టే
‘నిజం చెప్పాలంటే 2014తో దీనికి పోలిక లేనేలేదు. మైదానంలో వ్యక్తిగత దూషణలు లేనంత వరకు హద్దు దాటనట్టే లెక్క. పోటీ హోరాహోరీగా ఉన్నప్పుడు మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయి. దీని గురించి అతిగా చెప్పను. ఏం జరిగిందో చెప్పేంత కీలకమేమీ కాదు. అంత తీవ్రతా లేదు. నా నిష్ర్కమణపై ఎలాంటి అసంతృప్తి లేదు. అప్పీల్ చేశారు. ఔటిచ్చారు. అంతే! ఇక మెల్‌బోర్న్‌పై దృష్టి సారిస్తాం' అని విరాట్ కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications