Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Champions Trophy hockey: సెమీస్‌లో భార‌త్‌కు భంగ‌పాటు.. నేడు పాక్‌తో ఢీ

India Lose The Match Asian Champions trophy Semi Final
The Super seven who secured medals for india in Tokyo Olympics 2020

ఢాకా: బంగ్లాదేశ్‌లో జ‌రుగుతున్న పురుషుల‌ ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫి హాకీ 2021లో భార‌త్‌కు భంగ‌పాటు ఎదురైంది. మూడు సార్లు ఆసియా ఛాంపియ‌న్ అయిన భార‌త్ ఈ సారి కూడా హాట్ ఫెవ‌రేట్‌గా బ‌రిలోకి దిగింది. దానికి త‌గ్గ‌ట్టుగానే టోర్నీలో ఓట‌మి లేకుండా దూసుకుపోయింది. కానీ సెమీఫైన‌ల్‌లో జ‌పాన్‌తో జ‌రిగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త్ బోల్తాప‌డింది. లీగ్ స్టేజ్‌లో జ‌పాన్‌ను 6-0 తేడాతో చిత్తుచేసిన మ‌న్‌ప్రీత్ సేన సెమీఫైన‌ల్‌లో అదే జ‌పాన్ చేతిలో ఓట‌మి పాలైంది. కాగా కాంస్యం కోసం పాక్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

ఆరంభంలోనే డిఫెన్స్‌లో ప‌డిన భార‌త్‌

ఆరంభంలోనే డిఫెన్స్‌లో ప‌డిన భార‌త్‌

ఢాకాలోని మౌలానా భసానీ హాకీ స్టేడియంలో జ‌రిగిన ఈ పోరులో మ్యాచ్ ప్రారంభమైన వెంట‌నే ల‌భించిన ఫెనాల్టీ షూటౌట్‌ను స‌ద్వినియోగం చేసుకున్న జ‌పాన్ త‌మ ఖాతా తెరిచింది. ఆ వెంట‌నే మ్యాచ్ రెండో నిమిషంలోనే జ‌పాన్ ప్లేయ‌ర్ ఫుజిషిమా గోల్ సాధించ‌డంతో ఆ జ‌ట్టు అధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో టీమిండియా ఆరంభంలోనే డిఫెన్స్‌లో ప‌డిపోయింది.

ఇంతలోనే 14వ నిమిషంలో జ‌పాన్ మ‌రో గోల్ సాధించింది. ఆ జ‌ట్టు ప్లేయ‌ర్ యోషికి గోల్ చేశాడు. దీంతో ఫ‌స్ట్ క్వార్ట‌ర్ ముగియ‌క ముందే జ‌పాన్ 3-0తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ 17వ నిముషంలో భార‌త్ గోల్స్ ఖాతాను తెరిచింది. టీమిండియా ఆట‌గాడు దిల్ ప్రీత్‌సింగ్ గోల్ చేసి జ‌ట్టును పోటీలోకి తెచ్చాడు. అయిన‌ప్ప‌టికీ స‌గం మ్యాచ్‌ ముగిసే స‌మ‌యానికి టీమిండియా 1-3తో వెనుక‌బ‌డింది.

రేసులోకి రాలేక‌పోయిన టీమిండియా

రేసులోకి రాలేక‌పోయిన టీమిండియా

రెండో అర్ధ‌భాగంలో ఇరు జ‌ట్లు హోరాహోరిగా త‌ల‌ప‌డ్డాయి. గోల్స్‌ కోసం ఆట‌గాళ్లు త‌మ శ‌క్తిని అంతా ధార పోసి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే మ్యాచ్ 35వ నిముషంలో జ‌పాన్ మ‌రో గోల్ సాధించింది. ఆ జట్టు ఆట‌గాడు కొసెయ్ గోల్ సాధించి జ‌పాన్‌ను 4-1 అధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ కాసేప‌టికి మ‌రో గోల్ సాధించి 5-1తో జపాన్ భారీ అధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సారి జ‌పాన్ ఆట‌గాడు ఓకా 41వ నిముషంలో గోల్ సాధించాడు.

చివ‌ర్లో పుంజుకున్నప్ప‌టికీ త‌ప్ప‌ని ఓట‌మి

చివ‌ర్లో పుంజుకున్నప్ప‌టికీ త‌ప్ప‌ని ఓట‌మి

మ్యాచ్ చివ‌ర్లో పుంజుకోని భార‌త ఆట‌గాళ్లు వ‌రుస‌గా రెండు గోల్స్ సాధించిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం అప్ప‌టికే జ‌రిగిపోయింది. మ్యాచ్ 43వ నిముషంలో కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌, 58వ నిముషంలో హార్ధిక్ సింగ్ గోల్ సాధించారు. అయితే ఆ త‌ర్వాత ఇంకా ఒక న‌ముషం మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డంతో టీమిండియా ఆట‌గాళ్లు ఏం చేయ‌లేక‌పోయారు. దీంతో ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫి సెమీఫైన‌ల్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ భార‌త్ 3-5 గోల్స్ తేడాతో జపాన్ చేతిలో ఓట‌మి పాలైంది. ఇదే జపాన్‌ను టీమిండియా లీగ్ స్టేజ్‌లో 6-0 తేడాతో ఓడించిన సంగ‌తి తెలిసందే.

ఓట‌మిపై హ‌ర్మ‌త‌న్ ప్రీత్ కామెంట్స్‌

ఓట‌మిపై హ‌ర్మ‌త‌న్ ప్రీత్ కామెంట్స్‌

సెమీస్ ఫ‌లితం తాము అనుకున్న‌ట్టుగా రాలేద‌ని ఓట‌మి అనంత‌రం టీమిండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. మ్యాచ్‌ను తాము చాలా బ‌ద్ద‌కంగా ప్రారంభించామ‌ని చెప్పాడు. ఏ జ‌ట్టును కూడా త‌క్కువ‌గా అంచ‌నా వేయోద్ద‌ని, ఈ ఫ‌లితం త‌మ‌కు ఒక పాఠం లాంటిద‌ని అన్నాడు. కాగా ఇక కాంస్యం కోసం పాకిస్థాన్‌తో జ‌రిగే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉంటామ‌ని వివ‌రించాడు.

నేడు భార‌త్, పాక్ ఢీ

నేడు భార‌త్, పాక్ ఢీ

టోర్నీలో మూడో స్థానం కోసం భార‌త జట్టు బుధ‌వారం పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. కాగా లీగ్ స్టేజ్‌లో పాక్‌ను టీమిండియా 3-1 తేడాతో ఓడించింది. మ‌రో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ద‌క్షిణ కొరియా చేతిలో 5-6 తేడాతో పాకిస్థాన్ ఓట‌మి పాలైంది.

Story first published: Wednesday, December 22, 2021, 11:19 [IST]
Other articles published on Dec 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+