యువరాజ్ సెంచరీ వృధా: భారత్ ఓటమి
హైదరాబాద్: వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ సెంచరీ వృధా అయింది. మూడో వన్డేలో భారత్ అస్ట్రేలియాపై ఓటమి చవిచూసింది. 13 పరుగులకే మూడ వికెట్లు కోల్పోయిన భారత్ ను సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. యువరాజ్ సింగ్ 3 సిక్స్ లతో 121 పరుగులు చేసి పరుగులు చేసే ఒత్తిడిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రమేష్ పొవార్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. రాహుల్ ద్రావిడ్, ఉతప్ప డకౌట్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ 43 పరుగులు చేయగా కెప్టెన్ ధోనీ 33 పరుగులకు అపుటయ్యాడు. ఆస్ట్రేలియా తన ముందుంచిన 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా 47 పరుగుల ఆధిక్యతతో గెలుపొందింది. దీంతో ఆస్ట్రేలియా 2-0స్కోరుతో సిరీస్ లో ఆధిక్యత సాధించింది. భారత్ 243 పరుగులకు ఆలవుట్ అయింది.తొలుత బ్యాటింగ్ చేసిన అస్ట్రేలియాకు హెడెన్, గిల్ క్రిస్ట్ మంచి ప్రారంభాన్ని అందించారు. హెడెన్ 60పరుగులు చేయగా సైమండ్స్ మరోసారి భారత బౌలర్లను ఉతికి ఆరేశాడు. సైమండ్సు 89 పరుగులు చేశాడు. గిల్ క్రిస్ట్ 29 పరుగులు చేశాడు. పాంటింగ్ 25 పరుగులు చేసి యువరాజ్ సింగ్ బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌలర్లు జహీర్ ఖాన్, శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఈ లక్ష్య సాధనలో బ్యాటింగుకు దిగిన భారత ఆటగాళ్లను బ్రెట్ లీ గడగడలాడించాడు. బ్రెట్ లీ 3 వికెట్లు తీసుకోగా, జాన్సన్ కు రెండు వికెట్లు వచ్చాయి. హాగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.
Story first published: Friday, October 5, 2007, 23:53 [IST]
Other articles published on Oct 5, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications