Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా ప్రతిభ మసకబారుతుందా?: సౌరభ్ గంగూలీ

Sourav Ganguly
లండన్: ఇంగ్లండ్ టూర్‌కు భారత్ సరిగా సన్నద్ధం కాలేదని... వాళ్ల ఆటతీరును చూస్తే ఓ సాధారణ జట్టులా కనిపిస్తోందని మాజీ కెప్టెన్ గంగూలీ అన్నాడు. ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం వల్ల సరైన ప్రిపరేషన్ లభించలేదన్నాడు. 2002, 2007 పర్యటనలతో పోలిస్తే ఇప్పటి జట్టు చాలా సాదాసీదాగా ఉందన్నాడు. అయితే మిగిలిన రెండు టెస్టుల్లో పుంజుకునే శక్తి భారత్‌కుందన్నాడు. 'సచిన్ ఇంకా సరైన ఫామ్‌లోకి రాలేదు. లక్ష్మణ్ కూడా అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. ద్రవిడ్ ఒక్కడే జట్టులో చక్కని ప్రదర్శన కనపరిచాడు. ప్రత్యర్థి 500 స్కోరు చేసినప్పుడు దానిని ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఇందుకోసం బలంగా పోరాడాలి. కానీ భారత్ జట్టులో అలాంటి పోరాటం కనిపించడం లేదని గంగూలీ అన్నారు.

లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో 196 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో పుంజుకోవల్సిన టీమిండియా మరింత చెత్త ఆటను ప్రదర్శించి అవమానపరమైన రీతిలో 319 పరుగుల తేడాతో ఓటమి పాలవడం మరింత దారుణమని గంగూలీ అన్నాడు. తొలి టెస్టులో క్రికెటర్లు అలిసి ఉండడం వల్లనే ఓడమని భారత కెప్టెన్‌ ధోనీ అన్న వాఖ్యలపై గంగూలీ మండిపడ్డాడు. అయితే రెండో టెస్టులో ఆ కారణలను సరిచేసుకోకుండా విశ్రాంతిలేని క్రికెటర్లను ఎందుకు ఆడేందుకు దింపారని సెలెక్టర్లపై కూడా మండిపడ్డాడు. అయితే ఇప్పుడు మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో మాత్రం తమ తప్పులను సరిదిద్దుకుని మైదానంలోకి దిగాలని ధోనీకి సూచించాడు. మూడు, నాలుగో టెస్టులను గెలిచి నెం.1 స్థానాన్ని కాపాడుకోవాలన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+