Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

122 పరుగుల అధిక్యంలో భారత్: హర్భజన్ తడాఖా

India
హైదరాబాద్: హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగులో భజ్జీ ఆమోఘ సెంచరీ కారణంగా సోమవారం భారత్ 122 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. భారత్ 472 పరుగులు చేసి ఆలవుటయింది. బజ్జీ 111 పరుగులతో నాటవుట్ గా నిలిచాడు. శ్రీశాంత్ కడ వరకు బజ్జీకి సహకరించి 24 పరుగుల అనంతరం ఎల్బీడబ్లూ అయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్సుకు తెరపడింది. భజ్జీ, శ్రీశాంత్ లు పదవ వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 10వ వికెట్ కు భారత్ కు ఇదే అత్యుత్తమం. నిన్న ఆట ముగిసే సమాయనికి భారత్ 9 వికెట్లకు 436 పరుగులు చేసింది. సోథీ 3, వెటోరి 5, మార్టిన్ 1 వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు న్యూజిలాండు 350 పరుగులకు ఆలవుట్ అయింది. జహీర్ ఖాన్ 4, శ్రీశాంత్ 1, హర్భజన్ 4, ఓజా 1 వికెట్లు తీసుకున్నారు. భజ్జీకి శ్రీశాంత్ బాగా సహకరించాడు. సచిన్, ధోనీ విఫలమైనా గంభీర్, సెహ్వాగ్, ద్రావిడ్, లక్ష్మణ మ్యాచ్ ను పటిష్ట స్థితిలో ఉంచారు. భజ్జీ మ్యాచ్ ను మంచి ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. భారత్ ఇన్నింగ్సుకు ముందు భజ్జీ మాట్లాడుతూ 150 పరుగుల ఆధిక్యం ఉంటే బావుంటుందని చెప్పాడు. అన్నట్టుగానే భజ్జీ తానే ఆడి భారత్ ను ఆధిక్యంలో నిలిపాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+