
భారత్‌లో కొన్ని రోజులు సంతోషంగా గడిపా
ఈ నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో కోహ్లీసేన దక్కించుకుంది. టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం స్టీవ్ స్మిత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు గాను భారత్‌లోనే కొన్ని రోజులు గడిపాడు. ఇలా సుదీర్ఘ కాలం పాటు భారత్‌లో గడపడంపై స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఐ లవ్ ఇండియా
‘ఐ లవ్ ఇండియా, సుదీర్ఘకాలం పాటు భారత్‌లో ఆడేందుకు ఇష్టపడతా. సొంత ఇంటికి దూరంగా ఉన్న సమయంలో భారత్ నాకు మరో ఇల్లు లాంటిదని భావిస్తా. ఇండియాలో నా ఫేవరెట్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి. అక్కడ ఫుడ్ కొంచెం కారంగా ఉంటుంది. నార్త్, సౌత్ ఇండియన్ పుడ్‌కి తేడాను గుర్తించలేను. బయట ఎండ ఎక్కువగా ఉన్నా, ఆ ఇబ్బంది తెలియకుండా అభిమానులు ఉన్నారు' అని స్మిత్ తెలిపాడు.

ధర్మశాల ఎంతో అందంగా ఉంది
'చివరి టెస్టు మ్యాచ్ జరిగిన ధర్మశాల ఎంతో అందంగా ఉంది. ఇక భారత్‌లో పూణె పట్టణం అంటే ఎంతో ఇష్టం. పూణెలో జరిగిన టెస్టులో సాధించిన సెంచరీ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైందని, ఆ టెస్టులో విజయం సాధించాం' అని స్మిత్ చెప్పుకొచ్చాడు. భారత్‌లో పూణె రైజింగ్ సూపర్ జెయింట్ కెప్టెన్‌గా లభించిన గౌరవంపై ఆశ్చర్యపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు. 'నిజంగా ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. అయితే క్రికెట్ పట్ల అక్కడున్న అభిమానులను తీరు మనల్ని ఓ అద్భుతమైన క్రికెటర్‌గా తీర్చిదిద్దుతుంది' అని స్మిత్ తెలిపాడు.

భారతీయులంటే నాకు చాలా ఇష్టం
'భారతీయులంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వారు క్రికెట్, సినిమా ఇలా అన్ని రంగాల పట్ల అవగాహన ఉంటుంది. నా స్నేహితులెవరైనా నాతో ఇండియా వస్తానంటే వారిని క్రికెట్ మ్యాచ్‌కి తీసుకెళ్తా. ఎందుకంటే మ్యాచ్ జరిగే సమయంలో వచ్చే అభిమానులు, వారి అరుపులు చూడాల్సిందే, వినాల్సిందే' అని స్మిత్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











