‘1990లలో పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పును ప్రస్తుతం టీమిండియా చేస్తోంది’ పాక్ దిగ్గజం రషీద్ లతీఫ్ కామెంట్లు

1990లలో వివిధ సిరీస్‌లలో డిఫెరెంట్ కెప్టెన్లను ఆడించి పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పునే ప్రస్తుతం భారత్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ విమర్శలు చేశాడు. ఇక జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించగా.. శిఖర్ ధావన్ మరోసారి వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు 3-0తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే భారత జట్టు తరఫున రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తదితరులు ఇటీవల వివిధ సిరీస్లకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు. ఈ సంవత్సరం భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన ఏడో ప్లేయర్ ధావన్. ఇక ఈ విషయమై రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. స్థిరమైన కెప్టెన్‌ను ఆడించే విషయమై టీమిండియా దృష్టి సారించడం లేదని లతీఫ్ విమర్శించారు. 1990లలో పాకిస్తాన్ చేసిన తప్పునే జట్టు మేనేజ్ మెంట్ చేస్తోందని దుయ్యబట్టాడు.

ఏడుగురు బ్యాకప్ కెప్టెన్లా..?
'ప్రతిఒక్కరూ బ్యాకప్ కెప్టెన్సీ విషయమై మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతేడాది కాలంగా ఏడుగురు బ్యాకప్ కెప్టెన్‌లను టీమిండియా ప్రయోగించింది. టీమిండియా చరిత్రలో ఇంతమంది కెప్టెన్లను మార్చడం ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా జట్టుకు వివిధ సిరీస్లలో కెప్టెన్లుగా వ్యవహరించారు. 1990లలో పాకిస్థాన్ జట్టు మేనేజ్ మెంట్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విఫలమైంది. ఇప్పుడు ఆ తప్పును భారత్ మళ్లీ చేస్తోంది' అని లతీఫ్ అన్నాడు.

మిడిలార్డర్, ఓపెనింగ్ స్లాట్ సమస్యాత్మకం
అలాగే సరైన మిడిలార్డర్‌ను, పర్ ఫెక్ట్ ఓపెనర్‌ను కనుగొనే విషయంలోనూ భారత్ వెనకంజలో ఉందన్నాడు. మిడిలార్డర్, ఓపెనింగ్ స్లాట్ లాంటి సమస్యాత్మక పొజిషన్లను భారత్ పరిష్కరించడం లేదని లతీఫ్ తెలిపాడు. అలాగే ఈ ఏడాది కెప్టెన్లుగా వ్యవహరించిన వాళ్లలో సైతం ఎవరూ జట్టుకు నిలకడగా రాణించే ప్లేయర్లు కాదని చెప్పాడు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి బలమైన నాయకుడు భారత్‌కు అవసరమని పేర్కొన్నాడు.

గంగూలీ, ధోనీ, కోహ్లీ లాంటి కెప్టెన్ కావాలి
'టీమిండియా పటిష్టమైన ఓపెనర్‌ను ఇంకా కనుగొనలేదు. వారికి స్థిరమైన మిడిలార్డర్ కూడా లేదు. ఎప్పుటికప్పుడు కొత్త కెప్టెన్లను మాత్రం తీసుకొస్తారు. పోనీ ఆ కెప్టెన్లు తమ ఆట విషయంలో పెద్దగా నిలకడ కూడా కనబర్చడం లేదు. కేఎల్ రాహుల్ ఇప్పుడు అన్ ఫిట్, రోహిత్ అంతకుముందు అన్ ఫిట్, విరాట్ మానసికంగా అసమర్థుడు. కాబట్టి ఇక భారత జట్టు మేనేజ్ మెంట్ ఆలోచించాల్సి ఉంటుంది. చాలా మంది కెప్టెన్‌లను మారుస్తున్నారు. దాని వల్ల లాభమేంటీ. టీమిండియాకు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి కెప్టెనే కావాలి' అని లతీఫ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications