Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్పల్‌ స్టేడియంలో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

India (IND) vs West Indies (WI) Live Score, 1st T20I: Bhuvneshwar back as India bowl in Hyderabad

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ మాట్లాడుతూ మంచు ప్రభావం నేపథ్యంలో ఛేదన సులభమవుతుందని చెప్పాడు.

పేసర్లు మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి వచ్చినట్లు కోహ్లీ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సొంతగడ్డపై వైట్‌వాష్‌ అయిన వెస్టిండిస్ జట్టు టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుండటంతో పరుగుల వరద ఖాయమని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్దఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు.

జట్ల వివరాలు:
భారత జట్టు: రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్, హెట్‌మైర్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), దినేశ్ రాందిన్(వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, కేస్రిక్ విలియమ్స్, ఖ్యారీ పిర్రే

Story first published: Friday, December 6, 2019, 19:03 [IST]
Other articles published on Dec 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+