న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇడియట్' అంటూ భారత నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన డేల్ స్టెయిన్

India in India does not count either: Dale Steyn shuts down Indian fan for mocking Centurion Test win

హైదరాబాద్: ఓ నెటిజన్‌పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్‌ స్టెయిన్‌ ట్విట్టర్‌లో మండిపడ్డాడు. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో వరుస ఓటములతో సతమతమవుతున్న సఫారీలకు ఈ విజయం ఎఁతో ఊరటనిచ్చింది. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులో, జట్టులో కొన్ని సంస్కరణల అనంతరం స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో సఫారీ జట్టుపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ డేల్ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు.

ఇదే ఆఖరి రోజు, 2019 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది: ట్విట్టర్‌లో బుమ్రాఇదే ఆఖరి రోజు, 2019 ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది: ట్విట్టర్‌లో బుమ్రా

అయితే, స్టెయిన్ ట్వీట్‌పై ఓ నెటిజన్ వెటకారం ప్రదర్శించాడు. గెలిచింది స్వదేశంలో కదా లెక్కలోకి రాదు అంటూనే దేవుడి దయతో మ్యాచ్‌ గెలిచారంటూ అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీంతో చిర్రెత్తుక్కొచ్చిన డేల్ స్టెయిన్ ఆ నెటిజన్‌పై ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

ఎంపీ పదవికి రాజీనామా చేస్తేనే!: డీడీసీఏ అధ్యక్షుడిగా గంభీర్ ఎంపికలో కొత్త ట్విస్ట్!ఎంపీ పదవికి రాజీనామా చేస్తేనే!: డీడీసీఏ అధ్యక్షుడిగా గంభీర్ ఎంపికలో కొత్త ట్విస్ట్!

అంతేకాదు ఆ నెటిజన్‌ భారత్‌కు చెందిన వాడని గుర్తించిన స్టెయిన్ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. "టీమిండియా కూడా భారత్‌లో గెలిచినవి లెక్కలోకి రావా? అయినా మా గెలుపుకు దేవుడితో సంబంధం ఏంటి? ఇడియట్‌" అంటూ అతడి ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ కామెంట్ పెట్టాడు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ ప్రారంభించిన తర్వాత దక్షిణాఫ్రికా సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌‌లో భాగంగా సఫారీలు ఇప్పటివరకు ఐదు టెస్టుల్లో ఓటమిపాలయ్యారు.

ఇంగ్లాండ్ సిరిస్‌కు రెండు వారాల ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సఫారీ జట్టుకు నూతన కోచ్‌గా మార్క్ బౌచర్‌ను బోర్డు నియమించిన సంగతి తెలిసిందే. బౌచర్ కోచింగ్ పర్యవేక్షణలో సఫారీ జట్టు తొలి టెస్టులోనే ఫలితాన్ని రాబట్టింది.

Story first published: Tuesday, December 31, 2019, 18:12 [IST]
Other articles published on Dec 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X