
హోం సీజన్‌లో టీమిండియా ఆడే మ్యాచ్‌లివే
హోం సీజన్‌లో టీమిండియా మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనున్న టీమిండియా ఆ తర్వాత శ్రీలంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌ను ఆడనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ ప్రకటించింది.

హైదరాబాద్‌లో టీ20, వైజాగ్‌లో వన్డే
ఆస్ట్రేలియాతో టీ20కి హైదరాబాద్ వేదిక కానుండగా, శ్రీలంకతో జరిగనున్న వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. ఇక ఇటీవలే కొత్తగా నిర్మించిన బర్సపర (గౌహతి), తిరువనంతపురం స్టేడియాలకు కూడా ఒక్కో మ్యాచ్‌ను కేటాయించారు. ఈ మ్యాచ్‌లకు సంబంధించిన తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

తేదీలు తర్వాత ఖరారు చేస్తాం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కోల్‌కతా, ఢిల్లీ, నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లు ఉన్నాయని... స్థానిక పండుగలు, సెలవు దినాలువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తర్వాత తేదీలు ఖరారు చేస్తామని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు.

సిరీస్‌లు, వేదికల వివరాలు:
Australia tour of India: September 17 to October 11. Five ODIs and three T20s.
Five ODIs in: Chennai, Bengaluru, Nagpur, Indore, Kolkata
Three T20s in: Hyderabad, Ranchi, Guwahati
New Zealand tour of India: October 22 to November 7. Three ODIs and three T20s.
Three ODIs in: Pune, Mumbai, Kanpur
Three T20s in: Delhi, Cuttack, Rajkot
Sri Lanka tour of India: November 15 to December 24. Three Tests, three ODIs and three T20s.
Three Tests in: Delhi, Kolkata, and Nagpur.
Three ODIs in: Dharamsala, Mohali, Vizag
Three T20s in: Kochi/Thiruvanantpuram, Indore, Mumbai.


Click it and Unblock the Notifications