For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు రహానె..?

India hint at Rahane recall in Jo'burg

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టుల్లో భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె ఆడకపోయినా రహానె ఆడితే మ్యాచ్ వేరేలా ఉండేది. అంటూ రెండు వారాలుగా చర్చల్లో వినబడుతూనే ఉంది. విదేశాల్లో, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మంచి రికార్డున్నప్పటికీ రహానెను ఈ సిరీస్‌లో ఆడించకపోవడం విమర్శలకు దారి తీసింది. మొదటి టెస్టులో జరిగిన వైఫల్యం తర్వాత కూడా రోహిత్‌‌ను రెండో టెస్టుకు కొనసాగించింది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌‌పై రెండు టెస్టుల్లో పరాజయం ఎదురుకావడంతో విమర్శల దాడి జరుగుతూనే ఉంది.

రహానెను పక్కన పెట్టిన కారణం కూడా ఒకటి కావడంతో విమర్శల దాడి మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు రహానెను తప్పక ఆడించాల్సిన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు కెప్టెన్‌ కోహ్లి. ఆదివారం టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ సాగిన తీరు చూస్తే రహానె. బుధవారం ఆరంభమయ్యే మూడో టెస్టులో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. రెండో టెస్టు తర్వాత మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ ఆరంభించారు. 4 గంటల పాటు సాగిన ప్రాక్టీస్‌లో రహానె ఎక్కువసేపే పాల్గొన్నాడు. ముందుగా ఫీల్డింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన రహానె ఆ తర్వాత బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాడు.

అజింకా రహానె చాలాసేపు సాదన చేయడాన్ని బట్టి మూడో టెస్టుకు తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువే. రహానెతో పాటు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, పుజారా, కోహ్లి, పాండ్య, రోహిత్‌ శర్మ, ధావన్‌.. బృందాలు బృందాలుగా బ్యాటింగ్‌ సాధన చేశారు. నెట్‌ సెషన్స్‌లో టీమ్‌ఇండియాకు సాయం చేయడానికి దక్షిణాఫ్రికా చేరుకున్న యువ పేసర్లు నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌ ప్రాక్టీస్‌కు హాజరయ్యారు. బౌలర్లు అశ్విన్‌, భువనేశ్వర్‌, షమి, బుమ్రా కూడా బ్యాటింగ్‌ సాధన చేశారు.

కోచ్‌ శ్రీధర్‌ పర్యవేక్షణలో పార్థివ్‌, రాహుల్‌, రహానె స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేశారు. ఇక శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో రాహుల్‌, విజయ్‌, పుజారా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. స్థానిక స్పిన్నర్ల బౌలింగ్‌లో పుజారా రెండు సిక్సర్లు బాదగా విజయ్‌, రాహుల్‌ కూడా భారీ షాట్లు కొట్టారు. ఆ తర్వాత వారికి జడేజా, అశ్విన్‌ కూడా బంతులేశారు. ఇషాంత్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఎడమ మోకాలికి గాయం కావడంతో ఐస్‌ ప్యాక్‌తో రుద్దుకోవడం కనిపించింది. వీరి తర్వాత రహానె, కోహ్లీ తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. భువనేశ్వర్‌, షమి కొత్త కూకబుర్రా బంతులతో బౌలింగ్‌ చేశారు. అనంతరం రోహిత్‌, ధవన్‌, పాండ్యా, సాహా తమ బ్యాట్లకు పనిచెప్పారు. నెట్‌ సెషన్‌కు ముందు కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తి నేరుగా పిచ్‌ వద్దకు వెళ్లి పరీక్షించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 9:37 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+