ఇండియా Vs ఆస్ట్రేలియా: 'టీ20 వరల్డ్‌కప్ గెలిచి సత్తా భారత్‌కు ఉంది'


హైదరాబాద్: భారత మహిళల జట్టుకి టీ20 వరల్డ్ కప్ గెలిచే సత్తా ఉందని వెటరన్ పేసర్ జులన్ గోస్వామి స్పష్టం చేసింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్‌లో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా వరుసగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసిన భారత మహిళల జట్టు ఇప్పటికే సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా గ్రూప్ స్టేజిలో నామమాత్రమైన మ్యాచ్‌లో భారత జట్టు శనివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

జులన్ గోస్వామి మీడియాతో మాట్లాడుతూ
శనివారం రాత్రి 8.30 గంటలకి గుయానా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జులన్ గోస్వామి మీడియాతో మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరడం ఎప్పుడూ గొప్పే. జట్టులో అందరూ ఆత్మవిశ్వాసంతో చక్కగా ఆడుతున్నారు. సెమీ ఫైనల్ అనగానే జట్టుపై ఒకింత ఒత్తిడి ఉండటం సహజం" అని అన్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత్
"జట్టులోని క్రికెటర్లు ఆ ఒత్తిడికి తలొగ్గకుండా స్వేచ్ఛగా ఆడగలిగితే, టీ20 ప్రపంచకప్‌ని హర్మన్‌ప్రీత్ సేన చేజిక్కించుకోగలదు" అని జులన్ గోస్వామి ధీమా వ్యక్తం చేసింది. 2010లో జులన్ గోస్వామి నాయకత్వంలోని భారత మహిళల జట్టు సెమీస్ వరకు వెళ్లింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు భారత మహిళల జట్టు సెమీస్‌కు చేరుకుంది.

టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జులన్
ఇటీవలే జులన్ గోస్వామి టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌పై సెంచరీతో టోర్నీకి అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ఆ తర్వాత రెండు హాఫ్ సెంచరీలతో మిథాలీ రాజ్ అద్భుత ప్రదర్శన చేసింది. స్మృతి మంధాన గత మ్యాచ్‌లో రాణించడంతో ముగ్గురు సీనియర్ క్రికెటర్లు కూడా ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్ జట్టు టైటిల్ అవకాశాలు మెరుగయ్యాయి. ఇప్పటి వరకు భారత్ జట్టు ఒక్క టీ20 ప్రపంచకప్‌ని కూడా గెలవలేదు.

జట్ల వివరాలు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), మిథాలీరాజ్, జెమిమా, వేద కృష్ణమూర్తి, దీప్తిశర్మ, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధ యాదవ్, అనుజ పాటిల్, ఏక్తా బిస్త్, హేమలత, మాన్సి జోషి, పూజ, అరుంధతి రెడ్డి
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), రేచల్ హేన్స్, నికోల్ బోల్టాన్, గార్డ్‌నర్, అలెసా హీలీ, కిమిన్స్, సోఫి, మూనీ, పెర్రీ, షట్, విలాని, తాల్యా, జార్జియా, నికోలా కారె.
టెలికాస్ట్: స్టార్ స్పోర్ట్స్‌లో రాత్రి 8.30 గంటలకు
హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications