న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌నకు పటిష్టమైన జట్టును ఎంపిక చేశారు: శిఖర్ ధావన్‌

India have strong side for World Cup says Openar Shikhar Dhawan

2019 ప్రపంచకప్‌కు బీసీసీఐ సెలక్టర్లు పటిష్ఠమైన జట్టును ఎంపిక చేశారని టీమిండియా ఓపెనర్‌ శిఖర్ ధావన్‌ అభిప్రాయపడ్డాడు. మంగళవారం అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు శిఖర్ ధావన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్రపంచకప్‌కు ఎంపికైన టీమిండియా జట్టుపై స్పందించాడు.

పటిష్టమైన జట్టు ఉంది:

పటిష్టమైన జట్టు ఉంది:

శిఖర్ ధావన్‌ మాట్లాడుతూ... 'భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది. టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇంగ్లండ్‌ వెళ్ళాక అద్భుతంగా ఆడతాం' అని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.

ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ఉంది:

ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ఉంది:

'డిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కోచ్‌ రికీ పాటింగ్‌, సలహాదారు సౌరవ్‌ గంగూలీ ఎంతో మద్దతు ఇస్తున్నారు. కెప్టెన్‌లుగా వారికున్న అనుభవాన్ని మాతో పంచుకుంటున్నారు. వారి అండతో జట్టులోని యువ ఆటగాళ్లు కూడా మరింత పరిణతి సాధించారు. ఢిల్లీకి ఈ సీజన్‌ చాలా బాగుంది. ఢిల్లీ ఫ్రాంచైజీ కొత్త పేరు, కొత్త జెర్సీ, కొత్త సహాయక సిబ్బందితో సరికొత్తగా ఉంది. భారత, విదేశీ ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు సమతూకంగా ఉంది.. ఈ కారణంగానే రాణిస్తున్నాం' అని ధావన్‌ తెలిపారు.

సెంచరీ గురించి ఆలోచించడం లేదు:

సెంచరీ గురించి ఆలోచించడం లేదు:

'సెంచరీ గురించి ఆలోచించడం లేదు, మ్యాచ్‌ గెలవడమే నాకు ముఖ్యం. జట్టును గెలిపించేందుకు నేను వికెట్‌ కాపాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు గెలవాల్సిన రెండు మ్యాచులలో ఓడిపోయాం. 3 పరుగుల తేడాతో నా సెంచరీ చేజారిందనే అనుకుంటుంన్నారు కానీ నేను 97 పరుగులు చేశానని గుర్తించాలి' అని శిఖర్ ధావన్‌ చెప్పుకోచ్చారు.

మే 30 నుంచి ప్రపంచకప్‌:

మే 30 నుంచి ప్రపంచకప్‌:

చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రపంచకప్‌కు వెళ్లే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సోమవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా.. రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రిషబ్ పంత్ బదులుగా దినేశ్‌ కార్తీక్‌ రెండో వికెట్‌ కీపర్‌గా ఎంపికయ్యాడు. రాయుడు స్థానంలో విజయ్ శంకర్.. రిజర్వ్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ స్థానం సంపాదించారు. ఇంగ్లండ్‌ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, April 17, 2019, 11:55 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X