Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీల గడ్డపై గెలిచేందుకు ఇదే గొప్ప అవకాశం: కోహ్లీసేనపై ద్రవిడ్ ప్రశంసలు

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో వచ్చే ఏడాది జరగనున్న టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు భారత్‌కు ఇదే గొప్ప అవకాశమని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరిస్ ముగిసిన అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 5న కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాను ఆ దేశంలో ఓడించే సత్తా భారత జట్టుకు ఉందని తెలిపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

భారత్‌కు గొప్ప అవకాశం

భారత్‌కు గొప్ప అవకాశం

ప్రస్తుత టీమిండియాలో ఫాస్ట్‌ బౌలర్లతో పాటు స్పిన్నర్లు అత్యుత్తమంగా రాణిస్తున్నారని, అదేవిధంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశమని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. 'ప్రస్తుత జట్టు ప్రకారం దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్‌ విజయానికి ఇది మంచి అవకాశం. మంచి పేసర్లు.. ఆల్‌రౌండర్‌ (హార్దిక్‌ పాండ్యా), జడేజా, అశ్విన్‌ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు' అని అన్నాడు.

 ప్రతి బ్యాట్స్‌మన్‌కు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం

ప్రతి బ్యాట్స్‌మన్‌కు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం

'జట్టులోని ప్రతి బ్యాట్స్‌మన్‌కు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికీ 40 నుంచి 50 టెస్టులు ఆడారు. కొంచెం అదృష్టం కలిసి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదు. అదే గనుక జరిగితే టీమిండియా మరో సిరిస్‌‌ను తప్పక కైవసం చేసుకుంటుంది' అని ద్రవిడ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

 స్ఫూర్తిగా విరాట్ కోహ్లీ

స్ఫూర్తిగా విరాట్ కోహ్లీ

ఇక, మైదానంలో ఆటగాళ్ల నుంచి తనకేం కావాలో దానిని రాబట్టేందుకు విరాట్ కోహ్లీ జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్‌ పేర్కొన్నాడు. కాగా, కోహ్లీ సేన ఇప్పటికే వరుసగా 9 టెస్టు సిరిస్‌లను కైవసం చేసుకుని గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ రికార్డును టీమిండియా సమం చేసింది.

టెస్టుల్లో కోహ్లీసేన ప్రపంచ రికార్డు

టెస్టుల్లో కోహ్లీసేన ప్రపంచ రికార్డు

దక్షిణాఫ్రికాలో జరగనున్న టెస్టు సిరిస్‌ను గనుక కైవసం చేసుకుంటే టెస్టుల్లో కోహ్లీసేన ప్రపంచ రికార్డుని నెలకొల్పుతుంది. ఇటీవలే కోహ్లీసేన శ్రీలంకపై 1-0తో టెస్టు సిరిస్‌ను గెలుచుకుంది. మూడు టెస్టుల సిరిస్‌లో కోహ్లీ లంకపై మూడు టెస్టుల్లోనే 610 పరుగులు చేశాడు. అంతకముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ల్లో కూడా కోహ్లీ 600కి పైగా పరుగులు చేశాడు.

 మూడు సిరీస్‌ల్లో 600కిపైగా పరుగులు

మూడు సిరీస్‌ల్లో 600కిపైగా పరుగులు

2014-15లో ఆసీస్‌పై 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లాండ్‌పై 655 పరుగులు చేశాడు. తద్వారా మూడు సిరీస్‌ల్లో 600కిపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో రాహుల్ ద్రవిడ్, సునీల్ గావస్కర్‌లు మాత్రమే రెండు సిరీస్‌ల్లో 600కు పైగా పరుగులు చేశారు.

Story first published: Friday, December 8, 2017, 10:09 [IST]
Other articles published on Dec 8, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+