Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖలీల్ అహ్మద్‌కు ప్రశంస: చాన్నాళ్లకు జహీర్‌ లాంటి బౌలర్ దొరికాడు

India have found the next Zaheer Khan in Khaleel Ahmed: Karsan Ghavri

హైదరాబాద్: టీమిండియాకు ఖలీల్‌ అహ్మద్‌ రూపంలో మళ్లీ జహీర్ ఖాన్ లాంటి ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌ దొరికాడని మాజీ పేసర్ కర్సన్ ఘవేరి అభిప్రాయపడ్డాడు. రాజస్థాన్‌కు చెందిన ఖలీల్ అహ్మద్ ఆసియా కప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఖలీల్... ఆ తర్వాత సూఫర్ ఫోర్ స్టేజిలో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌పై కర్సన్ ఘవేరి మాట్లాడుతూ "ఖలీల్‌ చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేస్తూ రెండు వైపులా స్వింగ్‌ రాబడుతున్నాడు. ఒకవేళ స్వింగ్‌కి మరికొంత వేగాన్ని జోడించగలిగితే అతను కచ్చితంగా ప్రమాదకర బౌలర్‌ అయ్యే అవకాశాలున్నాయి" అని అన్నాడు.

"టీమిండియాకు జహీర్‌ఖాన్‌ దూరమైనప్పటి నుంచి ఇప్పటివరకూ చెప్పుకొదగ్గ ఎడమ చేతి వాటం బౌలర్‌ దొరకలేదు. ఒకరిద్దరు వచ్చినా వాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఆసియాకప్‌లో ఖలీల్‌ అహ్మద్‌ ప్రదర్శన చూస్తే జట్టుకు ఉపయుక్తమైన ఎడమ చేతి వాటం బౌలర్‌ దొరికినట్లు అనిపించింది" అని తెలిపాడు.

"కచ్చితత్వంతో వేసే అతని బౌలింగ్‌ విధానం అద్భుతంగా ఉంది. బంతిని రెండు వైపులా స్వింగ్‌ రాబడుతూ విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అతను ఇదే నిలకడ కొనసాగిస్తే భవిష్యత్తులో టీమిండియాకు కీలక బౌలర్‌ కాగలడు. సుదీర్ఘకాలం ఆడాలనుకుంటే మాత్రం గాయాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి" అని కర్సన్‌ సూచించాడు.

Story first published: Tuesday, November 13, 2018, 19:06 [IST]
Other articles published on Nov 13, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+