భారత్‌లోనూ గిల్‌క్రిస్ట్ లాంటి బ్యాట్స్‌మన్ ఉన్నాడు: పంత్‌పై అజహరుద్దీన్


హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గురువారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (159) కెరీర్ బెస్ట్ స్కోరు అందుకుని.. ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
ఈ నేపథ్యంలో రిషబ్ పంత్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ సెంచరీ ఇన్నింగ్స్ గురించి తాజాగా అజహరుద్దీన్ మాట్లాడుతూ "సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అతను ఇంకా వికెట్ కీపింగ్‌లో మెరుగవ్వాల్సి ఉంది" అని అన్నాడు.
పంత్‌ను గిల్‌క్రిస్ట్‌తో పోల్చిన అజహరుద్దీన్
"సాధారణంగా ఎక్కువ సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించే పంత్.. సిడ్నీలో 159 పరుగులు చేసినా కేవలం ఒక సిక్సరే కొట్టడం నన్ను ఆశ్చర్యపరిచింది. పంత్ చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి భారత్ జట్టు ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరహాలో ఓ బ్యాట్స్‌మెన్‌ని కనుక్కోగలిగింది" అని అజహరుద్దీన్ అన్నాడు.
సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
సిడ్నీ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

పంత్ ఖాతాలో అరుదైన ఘనత
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్‌లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. తొలిసారి పంత్ ఆ ఘనత సాధించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు. ఈ పర్యటనలో ఫారూఖ్ ఇంజినీర్ 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డు సాధించాడు.

టెస్టుల్లో పంత్‌కు ఇది రెండో సెంచరీ
ఇక, భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్‌కు ఇది రెండో సెంచరీ. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో పంత్ 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు జెఫ్రీ డుజాన్ తర్వాత ఇంగ్లాండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచరీలు చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications