వరల్డ్‌కప్ గెలిస్తే కోహ్లీసేనదే NO.1: జట్టు ఎంపికపై ద్రవిడ్ కామెంట్

హైదరాబాద్: మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ఇంకా నెలరోజులే సమయం ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు సమతూకంతో ఉందని అన్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
"గత 30 నెలలుగా టీమిండియా మంచి ప్రదర్శన చేసింది. అయితే, వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన సిరిస్‌లో మాత్రం ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా ఓటమిపాలైంది. ప్రస్తుతం వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టు అద్భుతంగా ఉంది. అన్ని విధాలా సరితూగే విధంగా ఉంది. అన్ని కాంబినేషన్‌ల ఆటగాళ్లు ఉన్నారు" అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
వరల్డ్‌కప్ నెగ్గి
"భారత క్రికెట్ జట్టు గనుక వరల్డ్‌కప్ నెగ్గితే 2-3 లేదా 3-2తో ఎవరు నెగ్గారనే ప్రస్తావన ఉండదు. ఇండియా ఏదైతే ఓడింతో అదొక కఠినమైన సిరిస్. అయితే, ఐసీసీ ర్యాంకులు మాత్రం టీమిండియా వరల్డ్‌కప్ నెగ్గి నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంటుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, టోర్నీలో ఎలా ఆడతారన్నదే ప్రశ్న" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

రాయుడు, పంత్‌లకు చోటు దక్కకపోవడంపై
వరల్డ్‌కప్ జట్టులో అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు చోటు దక్కకపోవడంపై టీమిండియా ఎంపికపై ఎల్లప్పుడూ ఒకటి, రెండు రకాలుగా వాదనలు ఉంటాయి. ఒకరిద్దరి ఆటగాళ్ల విషయంలో వాదనలు జరుగుతుంటాయని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో సెలక్టర్లు రాయుడు, పంత్‌కు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే.

ద్రవిడ్ మాట్లాడుతూ
అయితే, ఆ తర్వాత విమర్శలు రావడంతో వీరిద్దరిని స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. కాగా, వరల్డ్‌కప్ జట్టుపై ద్రవిడ్ మాట్లాడుతూ "ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు. వారు బాగా రాణిస్తారని ఆశిద్దాం. కొంత కాలంగా టీమిండియా చాలా అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచకప్ భారత జట్టు కూర్పు చాలా బాగుంది" అని చెప్పుకొచ్చాడు.

పరుగుల వరదే
"ఈ వరల్డ్‌కప్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టు కూడా పరుగుల వరద పారిస్తుంది. వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇస్తోన్న ఇంగ్లండ్‌లో ఇప్పుడు పాత పరిస్థితులు ఇప్పుడు లేవు. వన్డేలకు అక్కడి వాతావరణం సానుకూలంగా ఉంది. అత్యధిక పరుగులు సాధించే అవకాశాలు ఉన్నాయి" అని ద్రవిడ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications